సిద్ధిపేటలో ఘోర ప్రమాదం

Updated By ManamFri, 09/14/2018 - 17:04
road accident in siddipet
road accident in siddipet

హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏఎస్-లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో అయిదుగురు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.  

మృతులు పాములపర్తికి చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు.  మృతుల కుటుంబీకుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం విషాదకరంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English Title
Five killed In siddipet road accident
Related News