సిరులు తెచ్చిన చేప

Updated By ManamWed, 08/08/2018 - 00:44
fish
  • అన్నదమ్ములను లక్షాధికారులను చేసిన ఘోల్ ఫిష్

fishపాల్ఘార్(మహారాష్ట్ర): అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరు చెప్పలేము. మహారాష్ట్రలో ఇద్దరు మత్స్యకార సోదరులకు అదృష్టం చేపం రూపంలో వరించింది. వారి వలలో చిక్కిన ఓ చేప ఆ సోదరులను లక్షాధికారులను చేసింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాకు చెందిన మహేశ్ మెహర్, భరత్ మెహర్ ఇద్దరు సోదరులు. మత్స్యకారులుగా జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే గత వారం అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. తిరిగి ఆదివారం రాత్రి తిరిగి వచ్చారు. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈ సారి వారి వలలో ఘోల్ జాతికి చెందిన ఓ భారీ చేప పడింది. ఆ చేప 30 కిలోల వరకు బరువు ఉంది. ఈ చేపను వేలం వేయగా ఓ ఎగుమతి సంస్థ రూ.5.5లక్షలకు పాడుకుని చేపను సొంతం చేసుకుంది. ఈ ఘోల్ చేపలోని ప్రతి భాగం ఉపయోగపడుతుంది. ఆహారంగా తీసుకోవడానికే కాకుండా, చేప శరీరంలో కొన్ని భాగాల్లో వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చేప గుండెను సీ గోల్డ్ అని పిలుస్తారు. పలు ఔషదాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉంది.అందుకే ఈ చేప భారీ ధరకు అమ్ముడుపోయింది. వేలం ప్రారంభించిన 20 నిమిషాల్లోనే రూ.5.5 లక్షలకు అమ్ముడుపోయింది. ఊహించని విధంగా క్షణాల్లో లక్షల సొమ్ము చేతికి రావడంతో మత్స్యకార సోదరులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నమాని ఆ సమస్యలు తీర్చుకోవడంతోపాటు, పడవ, వల మరమ్మతులకు వచ్చిన సొమ్మును వినియోగిస్తామని ఆ మత్స్యకార సోదరులు తెలిపారు.

Tags
English Title
Fish brought by the cirrhs
Related News