‘ఏడ తానున్నాడో’ ఫస్ట్ లుక్ 

Updated By ManamFri, 11/09/2018 - 23:43
yeda thaanunnaado

imageఅభిరామ్, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న ‘ఏడ తానున్నాడో’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి విడుదల చేసారు.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తుండగా ఎ.శ్రీకాంత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English Title
First Look




Related News