హీరోయిన్ పార్లర్‌పై కాల్పులు

Leena

ప్రముఖ మలయాళ నటి, మోడల్ లీనాపాల్‌ బ్యూటీపార్లర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శనివారం మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పార్లర్‌పై కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి గాయలు కాలేదు.

కాగా అండర్‌ వరల్డ్‌‌తో ఉన్న ఆర్థిక పరమైన విభేదాలే ఈ దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పార్లర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా గతంలో లీనాపై పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులు ఉన్నాయి. 2013, 2015లలో చీటింగ్‌ కేసుల్లో ఈమె అరెస్ట్‌ అయినట్టుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు