దీపికా పదుకోణ్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం..

Updated By ManamWed, 06/13/2018 - 16:22
Fire breaks out at Deepika Padukone’s building, the Padmaavat actor is safe

As fire breaks out in Deepika Padukone's building

ముంబై: నగరంలోని భీమండి వర్లీ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వాణిజ్య సముదాయంలో మంటలు పెద్ద ఎత్తున ఎగసిబడుతున్నాయి. క్షణాల్లోనే పై అంతస్తులను మంటలు కమ్మేశాయి. భవనం 33 అంతస్థులు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందన్న విషయం తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. ఈ అగ్ని ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్ బాలీవుడ్ నటి దీపికా పదుకోణ్ నివాసముంటోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు దీపికా ఇంట్లో లేదు. బుధవారం మధ్యాహ్నమే ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో నటి ప్రమాదం నుంచి సురక్షితంగాబయటపడినట్లైంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియరాలేదు. విషయం తెలుసుకున్న దీపికా అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు అభిమానులు ‘ఓ మై గాడ్.. దీపికా సేఫ్.. థ్యాంక్యూ గాడ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా.. 2010లో దీపికా పదుకోణ్ ఈ అపార్ట్‌మెంట్‌లో ఇళ్లు తీసుకోవడం జరిగింది. అప్పడ్నుంచి ఆమె తన తండ్రి ప్రకాశ్ పదుకోణ్ కలిసి ఉంటోంది. దీపికా-ప్రకాశ్ పేరుతో ఈ ఆస్తి రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై ట్విట్టర్‌లో దీపికా స్పందన
"
నేను సురక్షితంగా ఉన్నాను. అందరికీ కృతజ్ఞతలు.. ప్రాణాలు పణంగా పెట్టి మంటలను అదుపు చేస్తోన్న అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రార్థన చేద్దాంఅని పేర్కొంది.

https://twitter.com/ANI/status/1006833516842106880

English Title
Fire breaks out at Deepika Padukone’s building, the Padmaavat actor is safe
Related News