ఫైనల్ వార్

Updated By ManamSun, 05/27/2018 - 03:52
dhoni
  • నేడు హైదరాబాద్, చెన్నై మధ్య ఐపీఎల్ టైటిల్ పోరు

imageఅంచనాలను తల్లకిందులు చేస్తూ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ ఒక వైపు.. హాట్ ఫేవరిట్ చెన్నై సూపర్ కింగ్స్ మరో వైపు.. దక్షిణాది జట్లు రెండూ ఇవాళ జరిగే ఐపీఎల్ మహాసంగ్రామం ఫైనల్లో తలపడబోతున్నాయి. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఈ సారి ఐపీఎల్ ఫైనల్లో టైటిల్ కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. బౌలింగ్ విభాగంలో సన్‌రైజర్స్ భీకరంగా ఉంటే.. బ్యాటింగ్ విభాగంలో చెన్నై ది కాస్త పైచేయిగా కనిపిస్తోంది.  2016లో ఫైనల్ సీన్‌ను సన్‌రైజర్స్ రిపీట్ చేస్తుందా... మరో సారి కప్ గెలుచుకుని చెన్నై హ్యాట్రిక్ సాధిస్తుందా... 

ముంబై : నరాలు తెగే ఉత్కంఠ నడుమ దాదాపు 50 రోజులు పైగా సాగిన 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్  క్లైమాక్స్‌కు చేరింది.  అండర్‌డాగ్స్‌గాబరిలో దిగిన సన్‌రైజర్స్ .. హాట్‌ఫేవరిట్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది  ఐపీఎల్ కప్ కోసం  పోటీపడుతున్నాయి. లీగ్‌దశలో అద్భుతాలు సృష్టించిన సన్‌రైజర్స్ ఈ మెగా మ్యాచ్‌లో చెన్నైని  చిత్తు చేసి 2016 సీన్‌ను రిపీట్ చేయాలని ఉత్సాహంతో ఉంది. తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో చెన్నై  చేతిలో ఓడినప్పటికీ రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో రెండు సార్లు చాంపియన్ నైట్‌రైడర్స్‌కు షాకిచ్చి ఫైనల్లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ చెన్నై గుండెల్లో గుబులు రేపుతోంది.  ముంబై  వాంఖడే స్టేడియంలో  జరిగే ఈ ఫైనల్లో చెన్నైని చిత్తు చేసి మరో సారి కప్ ఎగరేసుకుపోవాలని ఉవ్విళ్లూరుతోంది. లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై చేతిలో పరాజయం పాలైప్పటికీ సన్‌రైజర్స్  ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది.  నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంటే.... నైట్‌రైడర్స్‌ను ఓడించిన ఉత్సాహంతో అదే  ఊపును కొనసాగించేందుకు ఢీ అంటోంది సన్‌రైజర్స్.

బౌలింగే బలం...
ఎప్పటిలాగే సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లోనూ బౌలర్లనే నమ్ముకుంది.  గింగిరాలు తిప్పే బంతితో అద్భుతాలు సృష్టిస్తోన్న బౌలింగే ప్రధాన బలం. లీగ్‌దశలో అద్భుతంగా రాణించిన కెప్టెన్ విలియమ్సన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అనుకున్నంత రీతిలో ఆడలేకపోయాడు. విలియమ్సన్‌తో పాటు శిఖర్‌ధావన్ కూడా బ్యాట్‌కు పని చెబితే చెన్నై ముందు భారీ లక్ష్యం ఉంటుంది. 

బ్యాటింగే ఆయుధం:
బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయగల సంచలన చెన్నై ఆటగాimageళ్లు  ఈ ఫైనల్ మ్యా చ్‌లో ప్రతాపం చూపెట్టేం దుకు రెడీ అవుతున్నారు. లీగ్ పోటీల్లో అద్భుతంగా ఆడిన  ధనాధన్ ధోనీతో పాటు వాట్సన్, రైనా, అంబటి రాయుడు  ఫైనల్లోనూ మెరుపులు మెరిపించటం ఖాయమని చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది. వీరికి తోడు డుప్లెసిస్, జడేజా, హర్భజన్ సింగ్, శార్థూల్ ఠాకూర్ సమర్థవంతంగా ఆడితే  విజయం ఖాయమని, కప్ తమదేనని  చెన్నై  నమ్మకం పెట్టుకుంది.


ఐపీఎల్ ఫైనల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేరడం ఇది రెండోసారి. ఐపీఎల్ 11వ సీజన్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటే అందులో 18 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో కూడా 18 పాయింట్లు ఉన్నప్పటికీ, రన్ రేట్ తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మే 22న ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో 2 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి పాలైంది. దీంతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

ఐపీఎల్ టైటిల్ ఛాన్స్ చెన్నైకే ఎక్కువ..!
చెన్నై:  ఐపీఎల్ 2018 సీజన్ విజేతగా నిలిచే అవకాశాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే చెన్నై సూపర్ కింగ్స్‌కే ఎక్కువగా ఉన్నాయని భారత మాజీ కెప్టెన్  శ్రీకాంత్ అభిప్రాయప డ్డారు.  ఫైనల్లోనూ సమిష్టిగా ఆడే చెన్నైకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీకాం త్ అన్నారు. చెన్నై ఇప్పటి వరకు మొత్తం 9 ఐపీఎల్ సీజన్లు ఆడగా.. ఇందులో ఏకంగా 7 సీజన్లలో ఫైనల్ చేరింది. ఈ అనుభవం కూడా ఆ జట్టుకి లాభిస్తుం దని శ్రీకాంత్ అన్నారు. ‘చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు మంత్రం ఒకటే.. తుది జట్టులో ఎక్కువ మార్పులు చేయకుండా.. ఒక జట్టునే కొనసాగిస్తూ.. సమిష్టిగా ఆడటం. అందుకే ఆ జట్టు ఏడోసారి ఫైనల్ చేరిందంటే నాకు ఏమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. చెన్నైని ధోనీ నడిపిస్తున్న తీరుని పొగిడేందుకు మాటలు చాలవు. ప్రతి ఒక్కరికీ జట్టులో బాధ్యతలు అప్పగించి జట్టుని నడిపిస్తున్న తీరు అద్భుతం. భారత జట్టు గెలిచిన నాలుగు మెగా టోర్నీలను ఓసారి పరిశీలిస్తే.. అందులో వ్యక్తిగత ప్రదర్శన కంటే...జట్టు సమిష్టి ప్రదర్శనే ఎక్కువగా కనిపిస్తుంది. 1983, 2011 వన్డే ప్రపంచకప్, 2007లో టీ20 ప్రపంచకప్, 1985లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఈ కోవలోకే వస్తాయి. టోర్నీ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కూడా సమిష్టి ప్రదర్శనతోనే రాణించింది. ఫైనల్లోనూ అదే సూత్రంతో సత్తా చాటొచ్చు’ అని  శ్రీకాంత్ వెల్లడించారు.

 

తుది జట్లు అంచనా
సన్‌రైజర్స్  : విలియమ్సన్ (కెప్టెన్), ధావన్, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా, దీపక్ హూడా, భువనేశ్వర్‌కుమార్, సిద్ధార్థ్ కౌల్,  యూసుఫ్ పఠాన్, బ్రాత్‌వైట్, రషీద్‌ఖాన్, షకిబుల్ హసన్.
చెన్నై సూపర్ కింగ్స్ : ధోనీ  (కెప్టెన్), రైనా, జడేజా, రాయుడు, డుప్లెసిస్, బ్రావో, హర్భజన్, వాట్స న్, రాయుడు, చాహర్, ఎంగిడి.

English Title
final war today
Related News