ఫెస్టివ్ ఫ్యాషన్

Updated By ManamWed, 10/31/2018 - 00:37
Festive fashion

imageఫ్యాషన్ కోషంట్ పెంచాలంటే శారీను ఎంచుకు తీరాల్సిందే. మరి చీరలు కట్టడం, వాటికి సూటబుల్‌గా ఉండే యాక్సెసరీస్‌తో కనిపించే ‘దేశీ స్టైల్’ వద్దనుకుని.. వెరైటీ స్టైల్ కావాలంటే? ఇందుకు విరుగుడే ఈ నయా ఫెస్టివ్ ఫ్యాషన్ కలెక్షన్. వివిధ టెక్స్‌టైల్ బ్రాండ్లు అత్యధిక ప్రయోగాలు ఇప్పుడు చీరలపైనే చేయడానికి కారణం కూడా ఇదే. 

జిప్‌సూట్
ఫ్యూజన్ శారీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. రెడీ టు వేర్ చీరలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. శారీ, జంప్‌సూట్ రెండూ కలిపి జిప్‌సూట్‌లా, పలాజూ శారీలా డబ్ల్యూ బ్రాండ్ లాంచ్ చేసిన కలెక్షన్ ఫ్యాషన్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. ‘‘ఫెస్టివ్ ఫ్యాషన్ విత్ ఏ వెస్ట్రన్ ట్విస్ట్’’ పేరుతో చాలా కంపెనీలు సరికొత్త చీరలను లాంచ్ చేస్తున్నాయి.
image
‘‘హూ సేస్ శారీస్ కెనాట్ బి ఏ డ్రెస్’’ అంటూ మోడ్రన్ ఔట్‌ఫిట్‌లను ఇష్టపడే అమ్మాయిలకు శారీ డ్రెస్‌లను పరిచయం చేస్తున్నారు. ట్రెండీగా, కంఫర్టబుల్‌గా ఉండే ఈ కలెక్షన్ ప్రస్తుతం హాట్‌కేక్‌లా మారింది. పండుగలు, పెళ్లిళ్లలో స్టైలిష్, ఎవర్‌గ్రీన్‌గా కనిపించేలా చేయడంలో చీరలకు తిరుగులేదు కనుక మీ వార్డ్‌రోబ్‌లోనూ ఇలాంటి చీరలుండేలా చూసుకోండి.

English Title
Festive fashion
Related News