'క్రాక్స్'కు చెక్ పెట్టండి ఇలా

Updated By ManamMon, 08/06/2018 - 15:38
feet cracks

చాలామంది ముఖానికి ఇచ్చే ప్రాధాన్యత పాదాలకు ఇవ్వరు. దీంతో పాదాలు పగలడంతో పాటు, నొప్పి కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాళ్ల పగుళ్లు, పగిలిన పాదాలు ఇవి చూడటానికి అసహ్యంగా మాత్రమే కాకుండా నొప్పి కూడా ఉంటాయి. పొడి చర్మంతో పాదాలు బాగా వత్తిడికి గురికావడంవల్ల పాదాలు పగులుతాయి. ఈ పగుళ్ల వలన చర్మ సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీటికి వంట ఇంటి చిట్కాలు సమర్ధవంతంగా ఉపయోగ పడుతాయి. అవి ఏంటో ఇది చదివి తెలుసుకోండి. 

foot cracks

నిమ్మరసం ... 
మూడు నిమ్మకాయలు తీసుకుని, వాటి రసాన్ని  వేడినీటిలో కలిపి మీ పాదాలను 15 నిమిషాల పాటు అలానే ఉంచండి. ఆ తర్వాత పాదాలను శుభ్రమైన టవల్‌తో తడి ఆరేవరకూ తుడిచివేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కాళ్లకు ఉన్న మురికి వదిలి పగుళ్లు తగ్గుతాయి.

కలబంద గుజ్జు.. 
కలబంద గుజ్జు, పసుపు కలిపి కాళ్లకు రాస్తే కాళ్ల పగుళ్ల బాధ నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

కొబ్బరి నూనె ... 
అరకప్పు కొబ్బరి నూనెలో చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం కలిపి ఆ మిశ్రమాన్ని పగుళ్లకు వారానికి రెండు సార్లు రాస్తే అవి క్రమంగా తగ్గుముఖం పడతాయి.

బొప్పాయి గుజ్జు .. 
బొప్పాయి గుజ్జులో  కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మెత్తగా పగిలిన కాళ్లకు రాస్తే మురికి పోవడమే కాకుండా పగుళ్లు కూడా తగ్గిపోతాయి.. 

వంటసోడా....  
పావు బకెట్ నీటిలో చెంచా వంట సోడా,చెంచా కొబ్బరి నూనె, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసి ఒక అరగంట సేపు అందులో పెట్టి ఉంచండి. అలా వారానికి ఒకసారైనా చెయ్యడం వలన పాదాలు మృదువుగా మారుతాయి. మీ పాదాలు పగుళ్లు కూడా తగ్గుతాయి.
 

English Title
feet crack kitchen remedies
Related News