రైతుకు అండ

Updated By ManamThu, 06/14/2018 - 00:37
KTR
  • వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నం.. సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల ప్రారంభం

  • రైతు బీమాలో రాజన్నసిరిసిల్ల ముందుండాలి.. తెలంగాణ వరదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు 

  • ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు.. 98.24 శాతం వరకు  రైతు బంధు సాయం

  • సీఎం కృషితో 24 గంటల కరెంట్ సరఫరా.. మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి

ktrకరీంనగర్: తెలంగాణలో వ్యవసాయం ఓ పండుగలా సాగుతుందని రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం రైతులకు అండగా ఉన్నందునే దండుగ అన్న వ్యవ సాయం పండుగలా మారుతుందని అన్నారు. సిరిసిల్ల మండలం సర్ద్ధాపూర్‌లో 75 ఎకరాలలో రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టిన వ్యవసాయ కళాశాలను బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆగస్టు 15 నుండి రైతు బీమాకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేటీఆర్ అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు స్థాయిలో నిర్మిత మవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు  అందిస్తామన్నారు. ‘రైతు బీమాలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో 98.24 శాతం వరకు రైతు బంధు సాయం అందించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మెట్ట ప్రాంతమైన  రాజన్న సిరిసిల్ల సన్యశ్యామలమవుతుందన్నారు.  నీళ్లు, నిధులు, నియమాకాలు కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లక్ష్య సాధనలో దుసుకుపోతుందన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ.. రూ. 38 లక్షల ఎకరాలకు, మూడు పంటలకు నీళివ్వనున్న కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర సృష్టిస్తుందన్నారు. సమైక్య పాలనలో కన్నీళ్లు చూసిన సిరిసిల్ల ప్రాంతం ఇప్పుడు నీటి కళ సంతరిం చుకుందన్నారు. రూ. 30 కోట్లతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసుకోవడం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతుందన్నారు.  తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి వ్యాఖ్యలు నిజం కానున్నాయన్నారు. ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియమాకం ద్వారా వ్యవసాయానికి మెరుగైన సేవలు అందను న్నాయన్నారు. రాబోయే ఆరు నెలల్లో సిరిసిల్ల, వేముల వాడ నియోజకవర్గాలలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతు బీమా ప్రీమియం కోసం రూ.2,271లను ప్రభుత్వం ఎల్‌ఐసికి చెల్లించనుందన్నారు. కేటీఆర్ కోరిక మేరకు ఈ ఏడాది  నుండే వ్యవసాయ కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్నాయని శ్రీనివాస రెడ్డి తెలిపారు. 86 ఏండ్ల తర్వాత రూ.1000 కోట్లతో నిజాం సాగర్ ప్రాజెక్టును ఆధునీకరిం చుకు న్నామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఎంతో ప్రగతి సాధిం చుకున్నామని తెలిపారు. విత్తనం నాటిన నాటి నుంచి పంట చేతికొచ్చి మద్దతు ధర, కొనుగోలు వరకు రైతు లకు సీఎం అండగా నిలబడ్డాడని తెలిపారు. భూ రికా ర్డుల ప్రక్షాళన వల్ల రూ.57.33 లక్షల మంది రైతులకు, 98.24 శాతం వరకు రైతు బంధు సాయం అందిం చామ న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, పిజెటిఎస్‌ఎయు వీసీ ప్రవీణ్‌కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు తదితరులు  పాల్గొన్నారు.

Tags
English Title
The farmer
Related News