జుకర్‌బర్గ్‌కు పదవీ గండం..!

Updated By ManamThu, 10/18/2018 - 11:02
Mark Zuckerberg

Mark Zuckerbergఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ పదవికి గండం వచ్చి పడింది. ఆ సోషల్ మీడియా దిగ్గజ చైర్మన్‌గా మార్క్ జుకర్‌బర్గ్‌ను తొలగించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫేస్‌బుక్ ఇంక్‌లో మెజారిటీ షేర్లు ఉన్న నాలుగు దిగ్గజ పబ్లిక్ ఫండ్స్ జుకర్‌బర్గ్‌ను చైర్మన్‌గా తొలగించాలనే ప్రతిపాదనను బుధవారం తెలిపాయి. కంపెనీలో అతిపెద్ద అసెట్ మేనేజర్లు కూడా ఈ ప్రతిపానకే ఓకే చేస్తారని వారు అభిప్రాయపడుతున్నారు.

అయితే 2017లో కూడా ఈ ప్రతిపాదన తెరమీదికి రాగా.. తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన కీలకమైనదని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్స్ వెల్లడించింది. డేటా హ్యాక్, కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ వంటి సమస్యల నుంచి ఫేస్‌బుక్‌ను బయటికి తీసుకురావడానికి ఇదే మార్గమని పేర్కొంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి నిరాకరించారు.

English Title
Facebook shareholders back proposal remove Zuckerberg
Related News