ఫేస్‌బుక్‌లో 200 యాప్స్ డిలీట్

Updated By ManamTue, 05/15/2018 - 08:36
facebook

facebook  డేటా లీక్‌తో విమర్శల పాలైన ఫేస్‌బుక్, సమాచారాన్ని దొంగిలిస్తున్న 200 థర్డ్ పార్టీ యాప్స్‌ను డిలీట్ చేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ప్రొడక్ట్స్ పార్టనర్ షిప్ వైస్ ప్రెసిడెంట్ ఇమి అర్జిబాంగ్ వెల్లడించారు. తాము వేల కొద్దీ యాప్స్ ను పరిశీలిస్తున్నామని, వాటిల్లో చాలా వాటిని తొలగించనున్నామని ఆయన పేర్కొన్నారు.

అయతే గత మార్చిలోనే జుకర్ బర్గ్, తమ ప్లాట్ ఫామ్‌పై ఉన్న యాప్స్‌పై విచారణ జరిపించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్గత టీమ్‌తో పాటు బయటి నుంచి వచ్చిన నిపుణులతో కూడిన టీమ్‌లు ఈ పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. 

 

English Title
Facebook deleted 200 Apps
Related News