ఖరీదైన ఆఫీస్ లొకేషన్ కనాట్ ప్లేస్

Updated By ManamThu, 07/12/2018 - 23:11
image

imageన్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆఫీస్ లొకేషన్ల ర్యాంక్‌లలో న్యూఢిల్లీలోని కనాట్ ప్లేస్ ఒక మెట్టు పైకెక్కి తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అక్కడ చదరపుటడుగు వార్షిక కిరాయి 153 డాలర్ల మేరకు ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ సి.బి.ఆర్.ఇ తెలిపింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బి.కె.సి) చదరపుటడుగుకు 96.51 డాలర్ల వార్షిక అద్దెతో 16వ ర్యాంక్ నుంచి 26వ స్థానానికి పడిపోయింది. నారిమన్ పాయింట్‌కు చెందిన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సి.బి.డి) కూడా చదరపుటడుగుకు 72.80 డాలర్ల వార్షిక అద్దెతో 37వ స్థానానికి దిగింది. అది గత ఏడాది 30వ ర్యాంక్‌లో ఉంది. గత ఏడాది బి.కె.సి 16వ స్థానంలో ఉండగా, నారిమన్ పాయింట్ 30వ స్థానంలో ఉంది. ‘‘అత్యంత వ్యయదాయుకమైన ఆఫీస్ లొకేషన్లలో  గత ఏడాది 10వ స్థానంలో ఉన్న ఢిల్లీలోని కనాట్ ప్లేస్ చదరపుటడుగుకు 153.26 డాలర్ల  వార్షిక అద్దెతో 9వ స్థానానికి ఎగబాకింది’’ అని సి.బి.ఆర్.ఇ పేర్కొంది. ఈ కన్సల్టెంట్ సంస్థ తన వార్షిక గ్లోబల్ ప్రైమ్ ఆఫీస్ ఆక్యుపెన్సీ కాస్ట్స్ సర్వే వివరాలను విడుదల చేసింది.  అద్దె, స్థానిక పన్నులు, హై-క్వాలిటీ ప్రైమ్ ఆఫీస్ ప్రాపర్టీలకు వసూలు చేసే సర్వీసు చార్జీలతో కూడిన మొత్తన్ని ఆ ఖరీదు ప్రతిబింబిస్తుంది. ‘‘ప్రధాన మార్కెట్ కావడం వల్ల ఢిల్లీ గణనీయమైన కార్యకలాపాలను వీక్షించడాన్ని కొనసాగిస్తోంది. స్థిరమైన వేకెన్సీ, అద్దె లు, కొత్తవారిని ఇముడ్చుకునే శక్తి తో (కనాట్ ప్లేస్) 9వ స్థానానికి చేరింది’’ అని సి.బి.ఆర్.ఇ సంస్థకు చెందిన ఇండియా, ఆగ్నేయాసియా విభాగ చైర్మన్ అంశుమన్ మ్యాగజైన్ అన్నారు. ముంబై మార్కెట్‌పై ఆయన ఆశావాదం వ్యక్తపరచారు. రానున్న నెలల్లో అది ఎగువ గతిలో సాగగలదని ఆయన అంచనా వేశారు. చదరపుటడుగుకు 306.57 డాలర్ల వార్షిక అద్దెతో హాంకాంగ్ (సెంట్రల్) మొదటి స్థానంలో ఉంది. లండన్ (వెస్ట్ ఎండ్), చైనాలో బీజింగ్ (ఫినాన్స్ స్ట్రీట్), హాంకాంగ్ (కౌలూన్), చైనాలో బీజింగ్ (సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చదరపుటడుగుకు 183.78 డాలర్ల వార్షిక కిరాయితో  న్యూ యార్క్ (మిడ్‌టౌన్-మన్‌హాటన్) ఆరవ ర్యాంక్‌లో ఉం ది. అదే మహా నగరంలో మిడ్‌టౌన్-సౌత్ మన్‌హాటన్ ప్రాంతం చదరపుటడుగుకు 171.56 డాలర్ల వార్షిక అద్దెతో 7వ స్థానంలో ఉంది. టాప్ 10 జాబితాలో టోక్యో (వురునౌచి/ఓటెవుచి) 8వ స్థానంలో ఉండగా, లండన్ (సిటీ) 10వ ర్యాంక్‌లో నిలిచింది. గ్లోబల్ ప్రైమ్ ఆఫీస్ ఆక్యుపెన్సీ వ్యయాలు గత ఏడాదికన్నా 2.4 శాతం పెరిగాయి. అవెురికాలో వ్యయం 3.2 శాతం పెరిగితే, యూరప్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలలో 2 శాతం పెరిగింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కమర్షియల్ లొకాలిటీలలో కిరాయి 1.7 శాతం పెరిగింది. గత 12 నెలల్లో అన్ని ప్రాంతాల్లోనూ అద్దెలో వృద్ధి నిలకడగా ఉందని సర్వే వెల్లడించింది. ‘‘ఫినాన్స్, టెక్నాలజీ, ఈ-కామర్స్ రంగాల నుంచి ఉన్న పటిష్టమైన డిమాండ్ గత ఏడాది నుంచి ప్రైమ్ ఆక్యుపెన్సీ వ్యయాలలో వృ ద్ధి గతిని పెంపొందించింది. స్థిరాస్తుల రంగానికి కమర్షియల్ ఆఫీస్ మార్కెట్ పటిష్టమైన వృద్ధి చోదక శక్తిగా కొనసాగుతోంది’’ అని కమర్షియల్  స్థిరాస్తుల మార్కెట్‌పై అంశుమన్ వ్యాఖ్యానించారు. 

Tags
English Title
Expensive office location Canad Place
Related News