తెరకెక్కనున్న ‘ఆపరేషన్ గుహ’

Updated By ManamThu, 07/12/2018 - 23:47
thailand
  • 400 కోట్లతో హాలీవుడ్ చిత్రం.. మ్యూజియంగా ‘థామ్ లువాంగ్’

thailandబ్యాంకాక్/మాసాయ్: థాయిలాండ్ గుహలో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను సినిమా మలచేందుకు నిర్మాణ సంస్థలు తెగ పోటీ పడుతున్నాయి. ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సుమారు 60 మిలియన్ డాలర్ల ఖర్చుతో(దాదాపు 400 కోట్ల) సినిమా తీయాలని నిర్ణయించింది.  ఇందుకు  సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, నిర్మాతలు మైకేల్ స్కాట్, అడమ్ స్మిత్‌లు అధికారికంగా ప్రకటించారు. గతంలో వీరు ‘గాడ్స్ నాట్ డెడ్’ సినిమాను నిర్మించారు. ఇక మరో దర్శకుడు ఎమ్ చూ కూడా ఈ థాయ్ ఆపరేషన్‌ను చిత్రంగా మలిచేందుకు సిద్ధమయ్యారు. ‘ఇదో అందమైన కథ. ప్రపంచం మొత్తాన్ని ఊపిరి బిగపట్టేలా చేసిన ఈ ఆపరేషన్‌ను.. తెరపై చూపించటం గర్వంగా ఫీలవుతున్నా’ అని ఆయన ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఇవన్‌హోయే పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. మరికొన్ని సంస్థలు కూడా సినిమా నిర్మాణంపై దృష్టి సారించాయి. కొన్ని సినిమాలు రెస్క్యూ ఆపరేషన్ కేంద్రంగా సినిమా తీస్తుండగా.. మరికొందరు టీమ్ కోచ్ పాత్ర నేపథ్యంలో సినిమా తీసేందుకు ఉద్యుక్తమవుతున్నాయి.

మ్యూజియంగా మారనున్న గుహ..
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతకు గురి చేసిన థాయిలాండ్ గుహను మ్యూజియంగా మార్చబోతున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు థాయి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  ఈ గుహలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరిస్తూ మ్యూజియంలో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయనున్నారు. థాయ్‌లాండ్ పర్యాటక ప్రాంతాల్లో ఈ గుహ ప్రత్యేకంగా నిలవనుందని ‘బీబీసీ’ వార్తా సంస్థ వెల్లడించింది. థాయ్‌లాండ్‌లో అతి పెద్ద గుహల్లో ఈ థామ్ లువాంగ్ కూడా ఒకటి. అయితే దీనిని టూరిజం స్పాట్‌గా మార్చే ముందు అన్ని రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు థాయ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా స్పష్టంచేశారు.

Tags
English Title
Expected 'Operation cave'
Related News