రాణించిన మంధన, హర్మన్‌ప్రీత్

Updated By ManamTue, 10/23/2018 - 03:52
mandhana
  • ఆస్ట్రేలియా-ఎపై భారత్-ఎ విజయం

  • మహిళల టీ-20 సిరీస్

imageముంబై: ఆస్ట్రేలియా-ఎతో ప్రారంభైమెన మహిళల టీ-20 సిరీస్‌లో భారత్-ఎ శుభారంభం చేసింది. భారత జట్టులో స్మృతి మంధన (40 బంతుల్లో 72), హర్మన్ ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 45) చెలరేగడంతో తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఎపై 4 వికెట్లతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. వెస్టిండీస్ వెదికగా వచ్చే నెలలో మహిళల టీ-20 ప్రపంచకప్ జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు బలైమెన ఆసీస్‌పై గెలువడం టీమిండియాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. సోవువారం ఇక్కడ జరిగిన తొలి టీ-20లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆసీస్‌లో హీదర్ గ్రాహమ్ (43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మరోైవెపు స్టాలెన్ బర్గ్ (39), తహిళ మెక్‌గ్రాత్ (31) పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా ఈ మాత్రం స్కోరును సాధించింది.

దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్‌ను చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టైమెన బౌలింగ్‌తో కట్టడి చేశారు. వరుసక్రమంలో వికెట్లు తీయుడంతో ఆసీస్ భారీ స్కోరును చేయులేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అనూజ పాటిల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతర లక్ష్యఛేదనకు దిగిని భారత జట్టుకు ఆరంభం కలిసి రాలేదు. జెమీమా రొడ్రిగ్యూస్ (4), వికెట్ కీపర్ తానియ భాటియా (0) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ సవుయంలో మంధన, హర్మన్‌ప్రీత్ అద్భుతైమెన బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్నారు. స్మృతి మంధన తనైదెన శైలీలో ఆడుతూ 40 బంతుల్లోనే 72 పరుగులతో చెలరేగగా.. మరోైవెపు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 39 బంతుల్లో 45 పరుగులు చేసి తవుజట్టును విజయానికి చెరువ చేశారు. చివర్లో ఆల్ రౌండర్ పూజ వాస్త్రకర్ (21 నాటౌట్) కీలక వైున ఇన్నింగ్స్‌తో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసి భారత్‌కు 4 వికెట్ల విజయాన్ని అందించింది. ఆసీస్ బౌలర్లలో లౌరెన్ రెండు వికెట్లు తీసింది. భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్ల మధ్య రెండో టీ-20 బుధవారం జరుగనుంది.

English Title
Excellent light, Harmanpreet
Related News