ఘనంగా బొగ్గు ఉత్పత్తి

Updated By ManamTue, 06/12/2018 - 22:50
coal

coalన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ఉత్పత్తి భారీగా పెరిగినట్లు కేంద్ర మంత్రి పీయష్ గోయల్ అన్నారు. బీజేపీ పాలనకు నాలుగేండ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  గత నాలుగేండ్లలో బొగ్గు ఉత్పత్తి 105 మిలియన్ టన్నులు పెరిగి 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 567 మిలియన్ టన్నుల మార్క్‌ను చేరిందని ఆయన తెలిపారు. కాగా నాలుగేండ్ల క్రితం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 462 మిలియన్ టన్నులుగా ఉంది. గతంలో ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల కాలంలో సాధించే  ఈ ఉత్పత్తిని నాలుగేళ్లలో సాధించామని గోయల్ అన్నారు. ఇంత భారీ ఎత్తున ఉత్పత్తి జరగటానికి బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం దోహదపడిందని  ఆయన పేర్కొన్నారు. అదే విధంగా,  రైలు రవాణా సుంకాన్ని ఏప్రిల్, మేలో 8 శాతం పెంచినట్లు ఆయన తెలిపారు. గత కొన్నేం డ్ల నుంచి బొగ్గు దిగుమతులు గణనీయం గా తగ్గినట్లు గోయల్ తెలిపారు.

Tags
English Title
Excellent coal production
Related News