ఇస్రో శాస్త్రవేత్తకు ఊరట

Updated By ManamFri, 09/14/2018 - 15:51
Nambi Narayanan
  • నంబి నారాయణన్ నిర్దోషి

  • కేరళ పోలీసులపై విచారణ

  • రూ. 50 లక్షల పరిహారం

  • గూఢచర్యం ఆరోపణలు తప్పు

  • సుప్రీంకోర్టు తుది తీర్పు

Nambi Narayanan

న్యూఢిల్లీ : ఇస్రో గూఢచర్యం కేసులో ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై తప్పుడు ఆరోపణలు మోపి ఆయనను అరెస్టుచేసిన కేరళ పోలీసు అధికారులపై విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నారాయణన్‌ను అనవసరంగా ఇబ్బంది పెట్టినందుకుగాను ఆయనకు ఇవ్వాల్సిన పరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 1994లో గూఢచర్యం ఆరోపణలతో నారయణన్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత 1996లో సీబీఐ ఈ కేసును విచారణకు తీసుకుని, నారాయణన్‌పై ఆరోపణలకు సాక్ష్యాలు ఏవీ లేవని చెప్పడంతో ఆయనను విడుదల చేశారు. 

సీబీఐ ప్రకటన తర్వాత ఈ కేసులో ఉన్న మరో ఇస్రో శాస్త్రవేత్త డి. శశికుమారన్ సహా నిందితులందరినీ నిర్దోషులుగా విడిచిపెట్టారు. అనంతరం నారాయణన్ జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించి, తనను కేరళ పోలీసులు తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని ఆరోపించారు. దాంతో 2001 మార్చి 14వ తేదీన కమిషన్ ఆయనకు తాత్కాలిక ంగా రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఆదేశించింది.

దానిపై ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. కేరళ పోలీసులపై విచారణ గానీ, చర్యలు గానీ అక్కర్లేదంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా నారాయణన్ సవాలు చేశారు. పోలీసుల చర్యలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి డీకే  జైన్ నేతృత్వంలోని కమిటీలో కేంద్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వ అధికారులున్నారు. 

English Title
Ex-ISRO Scientist Nambi Narayanan Unnecessarily Harassed By Kerala Cops
Related News