పుట్టినరోజున.. 3 గంటలు క్యూలో కేంద్ర మంత్రి.. 

Rajasthan assembly election, EVM snag, Arjun Meghwal, Arjun Meghwal's birthday today
  • మొరాయించిన ఈవీఎంలు.. ఓటర్ల ఫిర్యాదులు

  • రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఘటన

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయించడంతో ఓట్లు వేసేందుకు వచ్చిన ప్రజలు గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో 172 బూత్ నెంబర్ వద్ద ఈవీఎంలు మొరాయించాయి. దీంతో రాజస్థాన్‌లో దళిత అభ్యర్థి బీజేపీ నుంచి బరిలోకి దిగిన కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్‌ ఓటు వేసేందుకు వచ్చారు. దాదాపు మూడుగంటలకు పైగా ఆయన క్యూలోనే వేచి ఉండాల్సి వచ్చింది. తన ఓటును వినియోగించుకునేందుకు ఈ రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ బూత్‌కు ఆయన వచ్చారు.

అప్పటికే భారీ క్యూ ఉండటంతో అందులోనే మంత్రి మేఘ్వాల్ నిలబడి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తన ఓటును వినియోగించుకొని వెళ్లిపోయారు. ఈవీఎంలు మొరాయించడం కారణంగా అసహనానికి గురైన ఓటర్లు ఎన్నికల సంఘం నిర్వహణ తీరును తప్పుబట్టారు. స్పందించిన అధికారులు ఈవీఎంలను సరిచేయడంతో పోలింగ్ కొనసాగుతోంది. కాగా, ఓటు వేసిన మంత్రి అర్జున్ మేఘ్వాల్‌ది ఈ రోజు పుట్టినరోజు (1954, డిసెంబర్ 7) కావడం విశేషం. మరో విశేషం ఏమిటంటే.. మేఘ్వాల్ తన ఓటును వినియోగించుకున్న పాఠశాలలోనే చిన్నతనంలో చదువుకున్నారట.  

సంబంధిత వార్తలు