ప్రతివ్యూహం

Updated By ManamSun, 10/07/2018 - 02:37
Every strategy

Every strategy‘‘మన వ్యూహం సఫలం అవ్వాలంటే ఈ నాలుగు రోజులు మనం ఈ హోటల్లో ఉండక తప్పదు’’ అన్నాడు జైరాజ్ తన లాప్‌టాప్ ఓపెన్ చేస్తూ. ‘‘నీ ఆలోచన ఏవిటో నాకు అర్థం కాలేదు. ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు ఇంత సీన్ అవసరమా?’’ విసుగ్గా అడిగాడు వీరూ. ‘‘ఫూల్.. మూర్ఖంగా మాట్లాడకు. మనం చెయ్యుబోయేది లాకారు, లూకారు దోపిడీ కాదు, బ్యాంక్ దోపిడీ. అది కూడా యూభై కోట్లు!’’ అన్నాడు జైరాజ్. ఆ మాట వింటూనే ఉలిక్కిపడి అలర్ట్ అయ్యూడు వీరూ. ‘‘ఓ గ్గాడ్.. నిజంగా మనం యూభై కోట్లు దోచుకోబోతున్నామా! వింటుంటేనే థ్రిల్లింగ్‌గా ఉంది బాస్.’’ అంటూ సిగరెట్ వెలిగించి, గుండెల నిండా పొగపీల్చి, రిలాక్స్‌డ్‌గా గుప్పుగుప్పుమంటూ వదిలి, ‘‘ఇంతకీ మనం దోచుకోబోయేది ఏ బ్యాంక్?’’ అనడిగాడు.

‘‘ఐశ్వర్యా బ్యాంక్’’ తాపీగా చెప్పాడు జైరాజ్.
లాప్‌టాప్‌లో పూనా-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే మ్యాప్ ఓపెన్ చేశాడు. ‘‘ఇదెందుకూ?..’’ అడిగాడు వీరూ. ‘‘ఫూల్.. నే చెప్పేది జాగ్రత్తగా విను. మధ్యలో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశావంటే షూట్ చేసి పారేస్తా’’ అంటూ రివాల్వర్ పక్కన ఉంచాడు జైరాజ్. తుపాకిని చూస్తూనే బుద్ధిమంతుడిలా చేతులు కట్టుకొని అతను చెప్పేది శ్రద్ధగా వినసాగాడు వీరూ. ‘‘పూనాలోని ఐశ్వర్యా బ్యాంక్ బ్రాంచి ఆఫీసులోని డబ్బును ప్రతి శనివారం ముంబై, దాదర్‌లో ఉన్న హెడ్డాఫీసుకు చేరుస్తారు. ఆ డబ్బుతో బయలుదేరిన వ్యాన్ ఏ దారి గుండా అక్కడికి చేరుతుందో తెలుసుకోవడానికే ఈ మ్యాప్.. జాగ్రత్తగా గమనించు..’’ అంటూ వ్యాన్ వెళ్లే దారిలో ఎన్ని రైల్వే క్రాస్‌లు వస్తారు, ఎన్ని టన్నెల్స్ వస్తారు, ఎక్కడ చెక్‌పోస్టులున్నాయో గుర్తించారు. మరీ ముఖ్యంగా ఎక్కడ రోడ్ రిపేర్లు జరుగుతున్నాయో నోట్ చేసుకున్నారు. ‘‘ఇప్పుడు మనకు కావలసిన వస్తువులు’’ అంటూ ఒక జాబితా తయూరుచేసి వీరూ చేతిలో పెట్టాడు జైరాజ్. ఆ లిస్టును అయోమయంగా చూస్తూ, ‘‘ఇవన్నీ పోగెయ్యూలంటే డబ్బులు కావాలిగా!’’ అన్నాడు వీరూ.

‘‘అరే! ప్రతి దానికీ అలా కుయ్యో మెుర్రో అంటూ మెుత్తుకోకు. ఇంద..’’ అంటూ ఓ చెక్ మీద పదివేలు అంకె వేసిచ్చాడు. ఆ చెక్ చూస్తూనే విస్తుపోయూడు వీరూ. ఎందుకంటే అది ఐశ్వర్యా బ్యాంక్ చెక్. ఇంతలో డోర్ బెల్ మోగడంతో లాప్‌టాప్ మూసి కాగితాలన్నీ సర్దేసి తలుపు తీశారు. రూమ్ బాయ్ ఫుడ్ తెచ్చి టేబుల్ మీద సర్ది ‘‘ఇంకేమన్నా కావాలా సార్..’’ అంటూ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ‘‘ఇంకేమీ అక్కర్లేదు. అవసరం అరుుతే పిలుస్తాం’’ అంటూ అతను బయటకు వెళ్లగానే ధడాల్న తలుపేసుకొని, తెచ్చుకున్న ఫుల్ బాటిల్ విస్కీ ఖాళీచేసి కడుపునిండా ఫుడ్ లాగించి, బెడ్‌పై వాలిపోయూరు. బారెడు పొద్దెక్కి సూర్యకిరణాలు చురుక్కుమని కళ్లల్లో గుచ్చుకోవడంతో ఉలిక్కిపడి లేచారిద్దరూ. గబగబా తయూరై ముందు రోజు తాము అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి బయలుదేరారు. ఎక్కడున్నా గంట గంటకూ సెల్‌ఫోన్‌లో కాంటాక్ట్ చేస్తూ ఉండమని చెప్పాడు జైరాజ్. అలాగేనన్నట్టుగా తలూపి వీరూ వెళ్లిపోయూడు. సాయంకాలం జైరాజ్ హోటల్ రూమ్‌కు చేరుకున్నాక వీరూ కోసం రెండు, మూడు సార్లు ఫోన్ చేసినా కలవలేదు. మరో అరగంట తర్వాత వీరూ ఫోన్ రింగరుంది కానీ ఎవరో అతనికి తెలియని ఓ ఆడ గొంతు వినిపించింది. జైరాజ్ కోపంగా ‘‘ఏయ్.. ఎవరు నువ్వు? ముందా ఫోన్ వీరూకు ఇవ్వు’’ అని గట్టిగా కసిరాడు. వీరూ ఫోన్ అందుకొని ‘‘సారీ గురూ’’ అన్నాడు. ‘‘నీ సారీ సరేగానీ.. అరే ఫూల్.. నీ పక్కన ఉన్నది ఎవరు? ఇప్పుడు ఇలా కొత్తవాళ్లతో ఉండటం ఎంత ప్రమాదమో తెలుసా! ఫోన్‌లో వాదన ఎందుగ్గానీ వెంటనే హోటల్‌కి వచ్చెరు్య’’ అన్నాడు. మరో అరగంట తర్వాత రూమ్‌కు చేరుకున్న వీరూను ‘‘ఎవర్రా ఆ అమ్మారు? అసలు నీకు బుద్ధుందా?’’ అని కోప్పడ్డాడు జైరాజ్. ‘‘తప్పరుపోరుంది అన్నాగా.. ఆ అమ్మారు పేరు సానియూ. ఇక్కడే ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది.’’

‘‘మన ప్లానంతా చేప్పేశావా?’’
‘‘లేదు.. లేదు. తను నన్నో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుకుంటోంది.’’ ‘‘సరేలే.. చేసిన నిర్వాకం చాలు.. తొందరగా పడుకో. రేపే మన ఆపరేషన్..’’ అన్నాడు జైరాజ్. బుద్ధిగా తలూపాడు వీరూ. పూనా, ముంబై రోడ్డుకు కొద్ది దూరంలో పొదల్లో ఓ వ్యాన్ పడిపోరు ఉంది. పక్కనే డ్రైవర్ కరీం, క్యాషియర్ జోషి, సెక్యూరిటీ గార్డ్ మాధవ్ గాయూలతో పడున్నారు. ఐశ్వర్యా బ్యాంక్ క్యాష్ వ్యాన్ దోపిడీ సమాచారం అందుకున్న పోలీస్ జీప్ అక్కడికి చేరుకుంది. ఎస్సై సంజయ్ వాడేకర్ కేసు టేకప్ చేశాడు. ‘‘అసలేం జరిగింది? ఇది మీరు రెగ్యులర్‌గా తిరిగే రూటే కదా?’’ అడిగాడు సంజయ్. అప్పుడే షాక్ నుంచి తేరుకున్న డ్రైవర్ కరీం ‘‘మూడు కిలో మీటర్ల అవతల ‘రోడ్ రిపేర్.. టేక్ డైవర్షన్’ అన్న బోర్డు చూసి దారి మళ్లించాం. కొద్ది దూరం ఈ అడవిలోకి రాగానే వ్యాన్ టైర్ పంచరర్యంది. ముగ్గురం కొద్ది దూరం తోసుకొస్తుంటే ఓ బుల్లెట్‌పై ఇద్దరు యువకులు వచ్చి తాము సాయం చేస్తామంటూ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. దాహంతో ఉన్న మేం ఆ నీళ్లు తాగేశాం..’’ అంటూ చెప్తుంటే, ‘‘మిగతా కథ నేను చెబుతాను ఆ నీళ్లు తాగిన మీరు మూర్ఛపోయూరు. ఆ యువకులు క్యాష్‌తో ఉడారుంచారు. అంతేనా?’’ అన్నాడు సంజయ్.

వాళ్లు తెల్లబోయూరు.
పోలీసుల విచారణలో ఆ దారిలో ఎలాంటి రోడ్డు మరమ్మతులు చేపట్టలేదని ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్ వాళ్లు తెలిపారు. కేవలం వీళ్లను దారి మళ్లించడానికే దుండగులు ఆడిన నాటకం అని అర్థమైంది. అంతలో సంజయ్‌కు మరో సమాచారం అందింది. క్షణం ఆలస్యం చెయ్యకుండా ఖండాలా ఘాట్ చేరుకున్నాడు. అక్కడ ఒక బుల్లెట్ వాహనం పడిపోరు ఉంది. దాని పక్కనే ఓ యువకుడు అపస్మారక స్థితిలో పడున్నాడు. అతడిని సోదా చేయగా, నాసిక్‌లోని సన్ లాడ్జి హోటల్ రూమ్ కీస్, ఒక లాప్‌టాప్ దొరికారు. వెంటనే అతడ్ని ముంబైలోని హాస్పిటల్‌కు తరలించారు. నాసిక్‌లోని సన్ లాడ్జిలో ఇద్దరు కుర్రాళ్లు నాలుగు రోజులుగా ఉంటున్నారని పోలీసులకు తెలిసింది. వారి గురించిన వివరాలు హోటల్ వాళ్ల దగ్గర లేవు. రిజిస్టర్‌లో వాళ్ల పేర్లు జైరాజ్, వీరూగా గుర్తించారు. గాయూలతో హాస్పిటల్‌లో చేరిన యువకుడు జైరాజ్. మరి వీరూ ఏమైనట్లు? డబ్బు దోచుకునే వరకూ ఒక్కటిగా కలిసున్న ఇద్దరూ డబ్బు చేతిలో పడగానే గొడవపడ్డారనీ, ఒకడు ఇంకొకడ్ని కొట్టి డబ్బుతో ఉడారుంచాడనీ అనిపించింది ఎస్సై అజయ్ వాడేకర్‌కు. జైరాజ్ స్పృహలోకి వచ్చాడు. అతడికి జరిగింది గుర్తుకొచ్చింది. డబ్బులున్న సూట్‌కేస్ పట్టుకొని వీరూ బండి వెనుక కూర్చున్నాడు. కొంత దూరం వెళ్లాక, వీరూ హఠాత్తుగా తన మీద దాడి చేసి, పారిపోయూడు. ఉస్సురని నిట్టూర్చాడు జైరాజ్.

పోలీసులు తమ పద్ధతిలో విచారణ చేశాక నోరు విప్పి జరిగిందంతా చెప్పాడు. ‘‘నీ స్నేహితుడే నీకు నమ్మక ద్రోహం చేశాడన్న మాట. వెధవ వేషాలు వేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఆ వీరూ గాడెక్కడ దొరుకుతాడు?’’ గద్దించాడు వాడేకర్.

‘‘నిజంగా నాకు తెలియదు సార్?’’
‘‘వాడి క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులు ఎవరైనా తెలుసుంటుందిగా..’’ జైరాజ్ కళ్లు మూసుకొని వీరూ ఫ్రెండ్స్ గురించి ఆలోచించాడు. సడన్‌గా తను ఫోన్‌లో మాట్లాడిన యువతి సానియూ పేరు జ్ఞాపకం వచ్చింది. ఆ విషయం చెప్పాడు జైరాజ్. వెంటనే సానియూ ఇంటి దగ్గర నిఘా పెట్టారు పోలీసులు. సన్ లాడ్జిలోని రూమ్ నంబర్ 110కు చేరుకుంది ఆ యువతి. నెమ్మదిగా తలుపు తట్టింది. కిర్రుమని తెరుచుకుంది తలుపు. రూమ్‌లో ఉన్న యువకుడు ఆత్రంగా ఆ యువతిని మీదకు లాక్కొని బిగియూరా కౌగిలించుకున్నాడు. ఆమె లైట్ వేయబోతుంటే వద్దన్నట్లు సైగ చేశాడు.

‘‘అబ్బా.. ఇంకా ఎంత కాలం ఈ చీకట్లో సరసాలు..!’’ నిష్ఠూరంగా అంది.
‘‘కొంచెం ఓపిక పట్టు. ఇంకా పోలీసుల నిఘా మనమీదే ఉంది. ఆ జైరాజ్‌గాడు చచ్చినా బాగుండేది. వాడి ఊపిరి ఆగేవరకు మనకు ఈ దోబూచులాట తప్పదు..’’ గాఢంగా ముద్దులు పెట్టుకున్నాడు. 

‘‘పాపం వీరూ..’’ అందా యువతి.
అప్పుడే ధడాల్న తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించారు పోలీసులు. లైట్లు వెలగడంతో ఇద్దరి రూపాలు బట్టబయలయ్యూరు. పోలీసులతో పాటు వచ్చిన జైరాజ్ అక్కడున్న యువకుడ్ని చూస్తూనే ‘‘నువ్వా?!’’ అన్నాడు ఆశ్చర్యంగా. పోలీసులు ఇద్దర్నీ ఒడిసి పట్టుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సానియూ అరుతే, మరొకరు సన్ లాడ్జి రూమ్ బాయ్ జావెద్! పోలీసులు దెబ్బలు రుచి చూపించేసరికి జరిగిందంతా కక్కేశాడు జావెద్. ‘‘నాలుగు రోజులుగా రూమ్ నంబర్ 116లో జైరాజ్, వీరూ పన్నుతున్న వ్యూహాన్ని వాళ్లకు తెలీకుండా ఫాలో అవుతూ వచ్చాను. వాళ్లు రూమ్‌లో లేనప్పుడు డూప్లికేట్ తాళాలతో లోపలికి వెళ్లి వాళ్లు చేయబోయేది బ్యాంకు దోపిడీ అని గ్రహించాను. అంతే కాదు, వీరూకు అమ్మారుల వీక్‌నెస్ ఉందని కనిపెట్టి సానియూను ఎరగా వేశాను. జైరాజ్‌ను వీరూ వదుల్చుకొనేలా పురిగొల్పా. నా ప్రతివ్యూహం సరిగ్గానే పని చేసింది. జైరాజ్‌ను వీరూ పడగొట్టగానే నేను వీరూ మీద దాడి చేశా. ఆ పెనుగులాటలో వీరూ ప్రాణాలు వదిలాడు. ఆ శవాన్ని అక్కడే పాతిపెట్టి, డబ్బు సంచితో ఉడారుంచా. డబ్బును ఇక్కడే దాచా’’ చెప్పడం పూర్తిచేశాడు జావెద్. తన వ్యూహానికి ఇలాంటి ప్రతివ్యూహం ఉంటుందని ఊహించని జైరాజ్ నిర్ఘాంతపోయూడు. పోలీసులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. 

Every strategy

English Title
Every strategy
Related News