పెట్రోల్, డీజిల్.. జీఎస్టీలోకి వద్దే వద్దు

Updated By ManamWed, 06/13/2018 - 16:04
Etela Rajender Says No To Petrol Diesel Under GST
  • అలా చేస్తే రాష్ట్రంపై ఆర్థికంగా పెను ప్రభావం పడుతుంది: ఈటల రాజేందర్

Etela Rajender Says No To Petrol Diesel Under GSTహైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ధరలు భారీగా పెరుగుతుండడం, సామాన్యుడిపై భారీగా భారం పడుతుండడంతో అందరూ అదే వాణిని వినిపిస్తున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు నో అంటోంది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకూడదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్ర ఆర్థిక స్థితిపై పెను భారం పడుతుందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను ఆయన తోసిపుచ్చారు. ‘‘పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం సరైన నిర్ణయం కాదు. అది దేశ సమాఖ్య విధానానికి విఘాతం కలిగిస్తుంది. వాటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలపై పెను ప్రభావం చూపిస్తాయి’’ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలను వ్యాట్‌ను తగ్గించుకోవాలని చెప్పేబదులు.. కేంద్ర ప్రభుత్వమే ఎక్సై్జ్ సుంకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. దాదాపు సంక్షేమ పథకాలన్నీ రాష్ట్రాలే అమలు చేస్తున్నాయని, కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఎక్సైజ్ సుంకం తగ్గించుకోవాలని ఆయన అన్నారు. మద్యాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకూడదని తేల్చి చెప్పారు. 

English Title
Etela Rajender Says No To Petrol Diesel Under GST
Related News