నా భార్యను చంపితే సరిపోయేది...

Updated By ManamThu, 09/20/2018 - 15:29
manohara chari
  • మనోహరాచారిలో ఏమాత్రం కనిపించని పశ్చాత్తాపం 

  • ఆవేశంతోనే దాడి చేశాను... నా భార్యను చంపితే సరిపోయేది

Manoharachari produced in court

హైదరాబాద్ :  ఇష్టం లేకుండా ప్రేమపెళ్లి చేసుకున్నదన్న ఆవేశంతోనే కూతురు, అల్లుడిపై దాడి చేశానని నిందితుడు మనోహరాచారి తెలిపాడు.  హైదరాబాద్ నడిబొడ్డున వందల మంది చూస్తుండగా కూతురు మాధవి, అల్లుడు సందీప్‌పై కత్తితో పాశవికంగా దాడి చేసిన అతడు పోలీసుల విచారణలో ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.

పైపెచ్చు కూతురు కులాంతర వివాహం చేసుకోవడానికి తన భార్యే కారణమని,  మాధవిని కాకుండా తన భార్యను చంపితే సరిపోయేదని మనోహరాచారి వ్యాఖ్యానించాడు. కాగా మనోహరాచారిని నిన్న పోలీసులు అరెస్ట్ చేయగా, ఇవాళ కోర్టుకు తరలించారు.

కాగా  ప్రేమ వివాహం చేసుకున్నందుకు తండ్రి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ మాధవి ఇప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరో 48 గంటల గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

English Title
Erragadda murder attempt case: Manoharachari produced in court
Related News