నదుల అనుసంధానంతోనే ప్రగతి

Updated By ManamThu, 06/14/2018 - 00:03
rivers

imageనదుల అనుసంధానం కొత్త విషయం కాదు. నాయకులు, స్వచ్చంద సంస్థలు అప్పుడపుడు ఈ విషయమై మాట్లాడు తారు. కొన్నిసార్లు చిన్నచిన్న ఉద్యమాలు జరుగుతాయి. టీవీల్లో డిబేట్స్ జరుగుతాయి. అంతే...మళ్ళీ మామూలయి పోతాం.  సమస్య సమస్యగానే ఉంటే అది ప్రజల నోళ్ళల్లో ఎప్పుడూ నానుతూ ఉంటుంది. 

1960 ప్రాంతంలో గ్రాండ్ కెనాల్ ప్రాజెక్ట్ పేరిట నాటి కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ కె.ఎల్.రావు నాయకత్వంలో  నదుల అనుసంధానం విషయమై కొంతముందుకు కదిలి నా మళ్ళీ 60 ఏళ్లుగా ఆ సమస్య అలాగే ఉండిపోయింది. నదులు పరిరక్షణ విషయంలో ఇటీవల ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతొ సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒకకోటి ఎస్సెమ్మెస్‌ల ద్వా రా మిస్డ్ కాల్స్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కానీ ప్రభు త్వంలో కదలిక లేదు. భారతదేశం నదులకు పుణ్యభూమి. గంగానది మొదలు యమున, బ్రహ్మపుత్ర, భగీరథి, అలక నంద, నర్మదా, తపతి, గోదావరి, కృష్ణా, తుంగభద్ర మొద లైన అనేక నదులు పుట్టిన ప్రదేశం, సముద్రంలో కలిసేప్రాంతం దాదాపు భారతదేశంలోనే జరుగుతున్నపుడు, మనం ఎందుకు వీటి అనుసంధానికి చొరవ చూపడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉండిపోయింది.  

మన దేశంలో ప్రతియేటా ఉత్తర భారతంలో నదులు పొంగి తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగడం మామూలై పోయింది. అస్సాంలో బ్రహ్మాపుత్ర ప్రవాహం కొన్ని వందల గ్రామాల్లో ప్రభావాన్ని చూపిస్తుంది. వరదల వలన జరుగు తున్న నష్టాన్ని నాయకులు పరామర్శించి అప్పటికపుడు ఏం టో కొంత ప్రకటించి దులిపేసుకోవడం కూడా పరిపాటి అయింది. కానీ, ఒక సమగ్రమైన వ్యవస్థ, శాశ్వత పరిష్కా రం కోసం తీసుకున్న జాడలులేవు. ఈ నిర్లక్ష్యం పనికిరా దు. ఇందువలన రేపటితరం బాగా నష్టపోతుంది. వేల కిలో మీటర్లు ప్రవహించే గంగానది, బ్రహ్మపుత్ర, గోదావరి, కృ ష్ణా, నర్మదా, యమున, సట్లెజ్ తదితర నదులెన్నో మన దేశంలో వున్నాయి. దేశంలో మూడవ పెద్ద నది కృష్ణానది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టి అనేక ఉపనదు లను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా బంగాళాఖాతంలో కలిస్తుంది. కృష్ణానదిపై కర్ణాటకలో నిర్మించిన అనేక ప్రాజెక్ట్స్ వలన భవిష్యత్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం వుంది. కర్ణాటక నీళ్లు వదిలితేనే తెలంగాణకు,  అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళతాయి. హైదరాబాద్ నగర జనాభాలో 60 నుంచి 70 శాతానికి కృష్ణ నుంచి వచ్చే మంచినీళ్లే ఆధారం. ఏటా నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు పడిపోతుండటంతో ఎమర్జెన్సీ పంపింగ్ చేస్తూ హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా జరుగుతున్నది. నదుల అనుసం ధానంతో నీటి ప్రవాహ ఉధృతి పెరుగుతుంది. ఎండిపోయి నట్లు కనిపించే నదుల్లో జీవకళ కనబడుతుంది.

నర్మదా నది విషయానికి వస్తే, ఈ నది మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్  పర్వతాల్లో పుట్టిమహారాష్ర్త, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలు స్తుంది. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ తో పర్యావరణంపై పెను ప్రభావం చూపిస్తుందని మేథాపాట్కర్ లాంటి విజ్ఞాన వంతులు గొంతెత్తి అరిచారు. అప్పటికే వేల  కోట్లు ప్రాజెక్ట్ పనుల మీద ఖర్చు చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రా జెక్ట్ నిర్మాణం చేపట్టారు. భవిష్యత్లో ఈ ప్రాజెక్ట్ ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు శాస్త్రజ్ఞులు హెచ్చరించారు. ఈ నది ప్రవాహం విషయంలో ప్రస్తుతానికి రాష్ట్రాల మధ్య బేధాభిప్రాయాలు లేకున్నప్పటికీ, పర్యావర ణానికి భీతి కలిగే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉందని చెబుతున్న నేపథ్యంలో నదుల అనుసంధానం ఆలోచన మ నకు రాకుండా ఉంటుందా? మహానది ఒరిస్సాలో ప్రవహిం చే అతి పెద్దనది. ఏటా ఈ నదీ ప్రవాహంతో అనేక ప్రాంతా లు జలమయ మవుతాయి. వందల కోట్ల మేర ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంటాయి. ఈ నది కూడా అమర్ కటక్ పీఠభూమిలో జన్మించి, బంగాళాఖాతంలో కలుస్తుంది. మ హానదికి అయిదారు ఉపనదులు కలిసి పెద్దనదిగా ప్రవహి స్తూ ఆ ప్రవాహానికి అడ్డుకట్టగా ఒరిస్సా ప్రభుత్వం ఈ న దిపై హీరాకుడ్ ప్రాజెక్ట్ నిర్మించింది. ప్రపంచంలోనే అతిపొడవైన 15 కిలోమీటర్ల పొడవు గల ఈ నదిపై ఆనకట్ట నిర్మిచారు. 

కావేరీ నది కథ మనకు తెలియనిది కాదు. కర్ణాటక, తమిళనాడు మధ్య ఈ నదీ వివాదం ఇప్పట్లో ఏ కోర్టులు, చట్టాలు చెప్పలేవు. కర్ణాటకలోని తల కావేరీ అనే ప్రదేశంలో పుట్టిన ఈ నదిపై కర్ణాటక ప్రభుత్వానికి పూర్తి హక్కులు వున్నాయి. కావేరీ నదిపై మైసూర్ జిల్లా మాండ్య ప్రాంతం లో కర్ణాటక ప్రభుత్వం కృష్ణరాజసాగర్ వంటి భారీ ఇరి గేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తే, తమిళనాడు మెట్టూరు డ్యామ్ నిర్మిం చింది. ఇరు రాష్ట్రాలకు చెందిన 59 చిన్న, మధ్య తరగతి ప్రాజెక్టులను కావేనిపై నిర్మించారు. చెన్నయ్ పట్టణానికి మంచినీరు కావాలంటే ఇటు తెలుగుగంగ, అటు కావేరిపై చెన్నై ప్రజలు ఆధారపడ్డారు. ఒకనదిపై ప్రాజెక్ట్ కడితే ఒక వైపు వ్యవసాయం, విద్యుత్ ఉత్పాదన, పరిశ్రమలు, సాగు నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు, పంట కాలువల నిర్మాణాలు, మరోవైపు ఆ నీటి ఆధారంగానే ప్రజలకు మంచినీరు అం దించే విధానాన్ని కొనసాగించాలి. ఈ లెక్కన ఈ రెండు రా ష్ట్రాల మధ్య చిచ్చులు మొదలయ్యాయి. ధర్నాలు, రాస్తా రోకోలు, పోలీస్ కాల్పులకు దారితీశాయి. ఇంత రాద్ధాంతా నికి కారణం కేవలం రాజకీయ అలసత్వం, కులతత్వం, నాయకుల స్వలాభం, పేద ప్రజలంటే  నిర్లక్ష్యం వైఖరి అనే స్పష్టంగా తెలుస్తుంది.  

హిమాలయ పర్వతశ్రేణుల్లోని కాళింది పర్వత సమూ హాల్లో యమునోత్రి వద్ద పుట్టిన యమునా నది ఢిల్లీ, హ ర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహా బాద్ వద్ద గంగలో కలుస్తుంది. ఈ నది ఢిల్లీ, మధుర, ఆగ్రా పట్టణాల నుంచి వెళుతుంది. ఢిల్లీలోని ప్రతి ఇంటి టాయిలెట్ నీళ్లు యమునలో కలుస్తాయని ఇటీవల వార్తలు వచ్చాయి. యమున పరివాహక ప్రాంతంలో సుమారు అయిదారు రాష్ట్రాల్లో వెలసిన వందలాది పరిశ్రమలు, కర్మా గారాలు వెదచల్లుతున్న విషపూరిత రసాయనాలతో  యమున పూర్తి కాలుష్యంగా మారింది. అయినా ఢిల్లీ వాసు లకు ఈ నీరే మంచినీరు. యమునా నదిని పరిశుద్ధం చేయ డానికి కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారుగానీ ప్రయోజనం శూన్యం అని కాగ్ నివేదిక బహిర్గతం చేసింది. యమునా క్లీనింగ్ ప్రాజెక్ట్ పేరుతో కూడా కోట్ల రూపాయులు ఖర్చు చేస్తున్నారు. యమున కాలుష్యాన్ని ఎండకాడుతూ యమున ముక్తి యాత్ర పేరుతో పోరాడుతున్నారు. శారద, యమున లింకేజ్ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తు న్నది. అంతరాష్ట్ర జలవివాదాలతో దాదాపు అన్ని రాష్ట్రాలు బాధలు పడుతున్నాయి. తపతి నదీ  మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్,  గుజరాత్ రాష్ట్రాలు, మహానదీ ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ట్రా లు, సట్లెజ్‌తో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరి యాణా రాష్ట్రాలు, బ్రహ్మపుత్ర నది వలన దాదాపు అన్ని ఈశాన్య రాష్ట్రాలు... ఇలా అన్ని రాష్ట్రాల మధ్య నదీ జలాల విని యోగంలో సమస్యలు వున్నాయి. ఇవన్నీ సమసి పోవాలం టే నదుల అనుసంధానమే మార్గం. ఇందువల్ల నదులన్నీ ఎప్పుడూ కళకళలాడుతుంటాయి. వరదల ముప్పు తగ్గి పో తుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. భూసారాన్ని పెం పొందించుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో తాగునీటికి  కొరత ఉండదు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ గోదావరిలో ఏటా సుమారు వేయి నుంచి పదకొండు వంద ల టీఎంసీల నీరు ప్రవహిస్తే, మహారాష్ట్ర, తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి కూడా నాలుగు నుంచి అయిదు వందల టీఎంసీల నీటిని కూడా వాడుకోవడం లేదని, మిగ తా నీరంతా సముద్రం పాలవుతున్నదని, రేపటి తరం నీటి కోసం పరితపించకుండా ఉండాలంటే, తగినన్ని ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ లెక్కలు దాదాపు అన్ని నదులకు వర్తిస్తుందని భావించవచ్చు. వేలాది కిలోమీటర్లు ప్రవహించే గంగానదీ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, యమునా తదితర అన్ని నదుల నీటిలో సింహభాగం సముద్రంలో కలిసిపోతున్నది. వృథాగా సము ద్రం పాలవుతున్న ఈ నీటిని కాపాడుకోవాల్సిన అవసరం వుంది. మొదటగా ఈ నదులను పర్యావరణ పరి రక్షణ నుంచి కాపాడి, అనంతరం అనుసంధానం ప్రక్రియ చేబ డితే ప్రయోజనకరంగా ఉంటుంది  దేశ వాణిజ్య  రాజధాని ముంబయికి చేరుకోవాలంటే పూణే రోడ్డు మార్గం ద్వారా మాత్రమే వెళ్ళాలి. వేలాది ట్రక్కులు ప్రతిరోజూ ఈ రోడ్డు మీద పయనించడానికి సుమారు ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టేది. ఈ రోడ్డును స్పీడ్‌వేగా మారిస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటుగా, కోట్లాది రూపాయల విలు వైన డీజిల్, టైర్ల అరుగుదల, డ్రైవింగ్ సామర్థ్యం, విలువైన సమయం మొదలైనవెన్నో పెరుగుతాయని తెలుస్తోంది. స్వీడ్ వే నిర్మాణం వల్ల ఏటా కొన్ని వందల కోట్ల రూపాయ లను మనం  పొదుపు చేసుకోవచ్చునని, అధికారులను, ప్రజాప్రతినిధులను ఆ రోడ్డు పనులు పూర్తి అయేంత కాలం ఏ  ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మార్చరాదని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అందువలన ఆ రోడ్డు పనులు సకాలంలో పూర్తి అయ్యాయి.

నాణ్యత, నమ్మ కంతో నిర్మించిన ఆ రోడ్డు మీద నేడు  వేలాది వాహనాలు పూణే నుంచి ముంబాయికి కేవలం కొద్దిగంటల్లో చేరు కుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంలో కూడా మొదటి నుంచి కొసాగుతున్న మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీఎస్ రెడ్డి హెచెమ్మార్ పనులు పూర్తయ్యేంత వరకు ఉంటారని నా టి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. అందుకే వేలకోట్లతో  మెట్రో రైల్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఒక  యజ్ఞం తలపెట్టినప్పుడు అందుకు పూనుకున్న వారికే అన్ని సంగతులు తెలుస్తాయి. ఆ పనులపై  పూర్తి పరిజ్ఞానం ఉంటుంది. అధికారులు మారితే పనుల్లో వ్యత్యాసం ఏర్పడుతుంది. నదుల పరిరక్షణ లేదా నదుల అనుసంధా నం విషయంలో కూడా ఇలాంటి శాశ్వత పరిష్కారాలు వున్నపుడు తప్పనిసరిగా అన్ని పనులు విజయవంతంగా జరుగుతాయి. మహానది గోదావరి, గోదావరి, కృష్ణ్ణ, పెన్నా ర్, పెన్నార్ కావేరీ, కావేరి వైగల్, కెన్‌బెత్వా, పార్ తపతి నర్మద, నేత్రావతి హేమావతి- ఇలా దేశంలోని నదుల న్నింటినీ సంధానం చేసే ప్రక్రియకు నాంది పలికి నప్పటికీ, పేపర్ మీద వున్న ప్రతిపాదనలు ముందుకు మూడు అడుగులు, వెనక్కి నాలుగు అడుగుల మాదిరిగా వున్నాయి. 
- కన్నోజు మనోహరా చారి
79950 89083

English Title
Enhancement of rivers
Related News