భారత్ విజయలక్ష్యం 269 పరుగులు

Updated By ManamThu, 07/12/2018 - 21:22
1st ODI, Team India  tour, Ireland, England Team, Nottingham
  • 268 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్

  • మణికట్టుతో స్పిన్ మాయాజాలం.. కుల్‌దీప్ యాదవ్ (25/6)

  • ఇంగ్లాండ్‌తో భారత్ తొలివన్డే 

1st ODI, Team India  tour, Ireland, England Team, Nottinghamనాటింగ్‌హమ్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌యాదవ్‌ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. తొలి ఓవర్‌ నుంచే విజృంభించిత కుల్‌దీప్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఇంగ్లాండ్ ఆరు వికెట్లను తీసి జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో 49.5ఓవర్లలో ఇంగ్లాండ్‌ 268పరుగులకే ఆలౌట్‌ అయింది. దాంతో భారత్‌కు ఇంగ్లాండ్ 269 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 

కుల్‌దీప్ స్పిన్ మాయ.. 
1st ODI, Team India  tour, Ireland, England Team, Nottinghamటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్ (38), బెయిర్‌స్టో (38) శుభారంభం ఇచ్చారు. అయితే వీరిద్దరిని (38) పరుగులకే పెవిలియన్ పంపించిన కుల్‌దీప్.. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ను సైతం మణికట్టు మాయాజాలంతో దడపుట్టించాడు. మిడిల్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ జోస్ బట్లర్‌(53; 51బంతుల్లో 5×4), బెన్‌ స్టోక్స్(50; 103బంతుల్లో 2×4) ఇరువురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు పూర్తి చేసింది. మిగతా ఆటగాళ్లలో ఎంఎం అలీ (24), రషీద్ (22) పరుగులకే చేతులేత్తేయగా, ప్లంకెట్ (10), కెప్టెన్ మోర్గాన్ (19) పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో చైనామన్ బౌలర్ కులదీప్ యాదవ్ ఒక్కడే ఒంటిచేత్తో 6 వికెట్లు పడగొట్టగా, పేసర్ ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు, యుజువేంద్ర చాహల్‌కు ఒక వికెట్ దక్కింది. 

లక్ష్య ఛేదనలో భారత్..
ఇంగ్లాండ్ నిర్దేశించిన 269 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు కోహ్లీసేన బరిలోకి దిగింది. ముందుగా భారత్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ (2), శిఖర్ ధావన్ (1) పరుగుతో క్రీజులో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వుడ్ తొలి ఓవర్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 1 ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులతో కొనసాగుతోంది. 

English Title
England set to target India for 269 runs
Related News