‘నుడి’ పరిరక్షణతోనే ఔన్నత్యం

Updated By ManamTue, 08/21/2018 - 01:00
telugu

దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవ రాయలు తెలుగు భాషా సంస్కృతి, వైభవాలను కొనియాడారు. కాగా ప్రపంచ భాషలలో తెలుగు అ నేక అద్భుతాలను ప్రోదిచేసుకున్న భాషగా, ది ఇటా లియన్ ఆఫ్ ఇ ఈస్ట్‌గా ఎందరో విద్యావేత్తలు, భాషా పరిశోధకులు ఎలుగెత్తి చాటారు. సంస్కృతం తర్వాత దేశంలో తెలుగు ఒక అద్భుతమైన, అంద మైన భాష అని ఎందరో ఏనాడో ఒప్పుకున్నారన్నది జగమెరిగిన సత్యం. అట్లాంటి అజారామరమైన తెలుగు భాషకు తెలుగు వాళ్ళే భ్రష్టు పట్టిస్తున్నా రన్నది ఎంతో బాధ కలిగించే విషయం.

image


నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ వారి 2011 జ నాభా ప్రాతిపదికగా చేసిన అధ్యయన నివేదిక ప్రకారం  దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 1971 లో 8.16 శాతం తో రెండవ స్థానంలో వుండగా, ప్రస్తుతం 6.6 శాతంతో నాలుగూ స్థానానికి పడిపో వడం తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు ఎంతో అవ మానకర విషయం. తెలుగు భాషకు మనమే స్వ యంగా తెగులు పట్టించడం, మాతృభాషను అశ్రద్ధ చేయడం సహించరాని విషయం. దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య నాలుగు శాతం పెరగగా, ప్రాంతీయ భాషలలో మరాఠీ ఆరవ స్థానం నుండి మూడవ స్థానానికి పెరగడం అదే సమయంలో మన స్థానం పడిపోవడం బాధాకరం. . ఇక మాతృభాష లో పాలన విషయంలో 82 శాతంతో యుపి, బిహార్, హరియాణా వంటిహిందీ రాష్ట్రాలు , 79 శాతంతో తమిళం పోటీ పడడం చూస్తూంటే వారికి తమ భాష పట్ల గౌరవం, దానిని కాపాడుకోవాలనే తపన స్ప ష్టంగా కనిపిస్తోంది. రాజ్యాంగంలోని 99 నాన్ షె డ్యూల్డ్ భాషల్లో దాదాపు 17 భాషలు కనుమరుగు అవడంతో పాటు వేగంగా అంతరించిపోతున్న భాష ల్లో తెలుగు ఒకటి అన్న సదరు నివేదిక పట్ల తెలుగు ప్రజలు అప్రమత్తం కావాలి. మాతృభాష పట్ల ఎన లేని ప్రేమ, తపన, గౌరవంతో ఆయా భాషల పరి రక్షణ కోసం మన పొరుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని చూసైనా మనకు కనువిప్పు కలగాలి. ఆంగ్ల, హిందీ భాషలను నేర్చుకోవాలన్న ఆసక్తి, తపన వుండడంలో తప్పులేదు కాని అదే సమయంలో తెలు గు నేర్చుకోవడం వలన ఉపయోగం లేదన్న పనికి మాలిన అభిప్రాయాలను విడిచి తెలుగు భాష నేర్చు కోవడం లో ప్రతి తెలుగువాడు కృషిచేయాలి. మాతృ భాషలు కనుమరుగు కాకూడదన్న సదుద్దేశంతో మ న పూర్వీకులు త్రిభాషా సూత్రాన్ని విధ్యావిధానం లో పొందుపరచారు. కాని ఆ త్రిభాషా సూత్రంలో ఫ్రెంచ్, జర్మనీ, సంస్కుతం వంటి విదేశీ భాషలను అమలుచేసి తెలుగును విస్మరించడం క్షమార్హం కా దు. తెలుగు కుటుంబంలో పుట్టి, తెలుగు మాటా ్లడడం, రాయడం రాదని గొప్పగా చెప్పుకోవడం ఒక రివాజుగా మారింది.

విదేశాలలో స్థిరపడినవారు త మ పిల్లలకు తెలుగు నేర్పించడంలో అనితర సాధ్య మైన కృషిచేస్తుంటే మన దేశంలో వున్నవారు తెలుగు ను విస్మరించడం, తెలుగు భాషపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం, జన్మనిచ్చిన మాతృమూర్తిని అశ్రద్ధ చేయడంతో సమానం. ప్రభుత్వాలు కూదా తెలుగు భాష పరిరక్షణపై ఉపన్యాసాలు దంచడం, శుష్క వా గ్దానాలు కురిపించడం మాని, ఒక సమగ్ర ప్రణా ళికతో తెలుగు భాషను, దాని వైభవాన్ని పునరు ద్ధరించేందుకు కృషిచేయాలి. గతంలో తెలుగు భాష లో 100 శాతం పాలనను చేపడాతామన్న వాగా ్దనాన్ని మన ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి. గ్రామ స్థాయి నుండి పాలనను తెలుగులోనే అమలు చేసేందుకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయ్యాలి. ప్రతి తెలుగు వ్యక్తి తెలుగు భాషలో పాండిత్యం సాధించే విధంగా విద్యా విధానాన్ని తక్షణం సంస్కరించాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది.ఈ నివేదిక తోనైనా మన కళ్ళు తెరుచుకొని తేనెకన్నా తీయనైన మన భాష  ఔన్నత్యాన్ని, ప్రాశస్థ్యాన్ని కాపాడే ప్రయత్నం చిత్తశుద్ధి తో చేయాలి.

- సిహెచ్. ప్రతాప్
9136827102

English Title
Empathy is the only way to preserve the 'Nudi'




Related News