12న ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తాం: రజత్ 

Updated By ManamFri, 11/09/2018 - 20:25
Rajat kumar, Election notification, Ballet paper, CEO Rajath, Telangana assembly elections 
  • ఎన్నికల బ్యాలెట్ గులాబీ రంగులో ఉంటుంది

  • ఓటరు స్లిప్ తెలుపు రంగు.. బ్యాలెట్ పేపర్ పింక్ రంగు

  • నేర చరిత్రకు సంబంధించి పత్రికలు, టీవీల్లో మూడుసార్లు ప్రకటించాలి

  • క్రిమినల్ చరిత్ర ఉన్నవారు సీ1గా ఇవ్వాలి: సీఈఓ 

Rajat kumar, Election notification, Ballet paper, CEO Rajath, Telangana assembly elections హైదరాబాద్: సెక్రటేరియట్‌లో 9 రాజకీయ పార్టీలతో శుక్రవారం సాయంత్రం సీఈఓ రజత్ కుమార్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ఆయన భేటీ ప్రధాన్యం సంతరించుకుంది. అభ్యర్థుల క్రిమినల్ కేసుల అఫిడవిట్ దాఖలు, శాంతియుత, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో రజత్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈ నెల 12న తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తామని రజత్ చెప్పారు. ఎన్నికల బ్యాలెట్ పత్రం గులాబీ రంగులోనే ఉంటుందన్నారు. ఓటరు స్లిప్ మాత్రం తెలుపు రంగులో ఉంటుందని సీఈఓ తెలిపారు. అభ్యుర్థుల నేర చరిత్రను అఫిడవిట్‌లో పొందుపరచాలని స్పష్టం చేశారు. నేర చరిత్రకు సంబంధించి మూడుసార్లు, పత్రికలు, టీవీల్లో ప్రకటించాల్సిందిగా సూచించారు. ప్రకటనలకు అయ్యే ఖర్చు ఎన్నికల వ్యయంలో భాగంగానే పరిగణిస్తామన్నారు. క్రిమినల్ చరిత్ర ఉన్నవారు సీ1గా ఇవ్వాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ పింక్ కలర్... ఓటర్ స్లిప్ వైట్ కలర్‌లో ఉంటుందన్నారు. 

ఇప్పటివరకూ రూ.64.36 కోట్ల నగదు, రూ.5.16 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు రజత్ తెలిపారు. 78384 మందిపై బైండోవర్, 14730 సీఆర్పీసీ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. 7367 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టు రజత్ కుమార్ స్పష్టం చేశారు. నాయకుల దురుసు భాషపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అభ్యంతరకర భాష వాడినందుకు హరీశ్ రావు, ప్రతాప్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిలకు నోటీసులు ఇఛ్చినట్టు సీఈఓ రజత్ తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ నుంచి సుధాకర్, బాల మల్లేశం, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎంఎస్ శ్రీనివాస్.. టీఆర్‌ఎస్ నుంచి వినోద్ కుమార్, శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్.. బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి ఆంథోని రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.  

English Title
Election notification will be declared on nov 12, says Rajat kumar 
Related News