ఈఫిల్ టవర్ మూసివేత

Effiel Tower

పారిస్: ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాడ్లు, గొడ్డళ్లు పట్టుకొని రోడ్లమీదికి వచ్చిన ఆందోళనకారులు కనిపించిన వాహనాలు, ఇళ్లను తగులబెట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారగా.. శనివారం ఈఫిల్ టవర్‌ను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా మరోవైపు ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 89వేల మంది పోలీస్ ఆఫీసర్లు డ్యూటీలో ఉన్నారు. పారిస్‌లో ఉన్న షాపులు, రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు