ఈ ఆదివారం నగరానికి మంచి ట్రైలర్ వస్తుంది.. కాస్కోండి!

Updated By ManamFri, 06/08/2018 - 20:13
Director Tharun bhascker, Ee Nagaraniki Emaindi Movie Trailer

Director Tharun bhascker, Ee Nagaraniki Emaindi Movie Trailer ‘పెళ్లి చూపులు’ సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు సినీపరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తరుణ్ భాస్కర్ మరో ఆస్తకరమైన కథ, కథనంతో ముందుకు వస్తున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో సందడి చేసిన ‘పెళ్లిచూపులు’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత తరుణ భాస్కర్ దర్శకత్వంలో ఏ చిత్రం కూడా రాలేదు. తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే ఆస్తకికరమైన సినిమా టైటిల్‌తో ముందుకు వస్తున్నాడు డైరెక్టర్ తరుణ్. ఓ నలుగురు మిత్రుల మధ్య సాగే కథ‌కు గోవా నేపథ్యాన్ని జోడించి యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

మరో విశేషం ఏమిటంటే.. సురేశ్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు సురేశ్ ప్రొడక్షన్స్ అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘‘ఈ ఆదివారం నగరానికి ఓ మంచి ట్రేలర్ వస్తుంది. అన్ని ఆదివారాల్లాగా ఈ ఆదివారం ఉండబోదు. సూర్యుడు ఉదయించి మళ్లీ ఆస్తమించవచ్చు. కానీ, మా ట్రైలర్ ఎప్పటికీ ఉదయిస్తూనే ఉంటుంది. వస్తుంది అంతే.. కాస్కోండి’’ అంటూ ట్వీట్ చేశారు. #ENETrailerOnSunday అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జతచేశారు.

English Title
Ee Nagaraniki Emaindi Movie Trailer to be come on sunday
Related News