జీవ వైవిధ్య పరిరక్షకులు

Updated By ManamMon, 05/14/2018 - 00:48
image
image

త్వరలో బెంగళూరు నీటి కొరతతో సతమతం కానుందనే హెచ్చరికల నేపథ్యంలో కొంతమంది పర్యావరణ యోధులు(eco warriors) నివారణ చర్యలకు నడుం బిగిస్తున్నారు. స్కూళ్లలో విద్యార్థులతో పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపడుతుండగా, అపార్టుమెంట్లలోను, ఖాళీ స్థలాల్లోను గార్డెనింగ్ పనులు చేపడుతున్నారు. ఊట ఫ్రమ్ యువర్ తోట పేరుతో బంగళాల్లో వ్యక్తిగత అడవుల (ఞ్ఛటట్చౌజూ జౌట్ఛట్టట) పెంపకాన్ని పోత్పహిస్తున్నారు. ఇందులో టెకీలు వారంతపు సెలవుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో  అమీన్‌పూర్ సరస్సు ఒడ్డున గ్రాైనెట్ క్వారీల ఆక్రమణల నుంచి కాపాడేందుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (టీఎస్‌ఎస్‌పీఎఫ్), హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్‌బీపీ), ఫ్రండ్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా సొసైటీ (ఎఫ్‌ఓఎఫ్‌ఎఫ్) సభ్యులు కృషిచేస్తున్నారు. పక్షుల విహార ప్రాంతంగా ప్రసిద్ధి కెక్కిన ఈ సరస్సును వీరు వారాంతంలో సందర్శిస్తూ పరిశుభ్రం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. 

ఈ సంవత్సర ఆరంభంలో హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ సరస్సు ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రత్యేక రక్షణదళం (టీఎస్‌ఎస్‌పీఎఫ్), హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్‌బీపీ), ఫ్రండ్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా సొసైటీ (ఎఫ్‌ఓఎఫ్‌ఎఫ్) సభ్యులు సమావేశమయ్యారు. పక్షుల ప్రేమికుల కు ఈ ప్రదేశం ఎంతో ప్రియవైునది. సరస్సు ప్రాంగణాన్ని, పరిసరాల్ని, నీటిని శుద్ధి చేసేం దుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. వారంవారం వారాంతంలో వారీ ప్రాంతానికి చేరుకుని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లా స్టిక్ సంచులు, ఇతర వ్యర్థపదార్థాలను ఏరివేసేం దుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంత చుట్టు పక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రజలు, అపార్టుమెంట్ల వాసులు, పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల ద్వారా వెలువడుతున్న వ్యర్థాలు ఈ సరస్సును చెత్తబుట్టగా తయారు చేశాయని టీఎస్‌ఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ తేజ్‌దీప్ కౌర్ మీనన్ తెలిపారు. ఈ సరస్సును టీఎస్‌ఎస్‌పీఎఫ్ ట్రైనిం గ్ అకాడమీ దత్తత తీసుకుంది. ఈ సరస్సు 222 రకాల పక్షులను ఆకర్షిస్తుందని తెలంగాణ రాష్ట్ర జీవైవెవిధ్య బోర్డు తెలిపింది. ఇక్కడ 250 రకాల మొక్కల సముదాయం, తొమ్మిది రకాల మత్స్య జాతులు, 26 రకాల జలచరాలు, 41 రకాల సీతాకోక చిలుకలు, 33 రకాల అకశేరుకాలు, 12 రకాల ఉభయచరాలు, 33 రకాల సరీసృపాలున్నాయి. వీటితో పాటు తొమ్మిది రకాల వన్యప్రాణులు కూడా ఉన్నాయి. 

ఆక్రమణలు, చట్టవ్యతిరేక బోర్‌వె ల్స్, ఎండిపోయిన వ్యర్థాలతో పాటు సరస్సు గట్టుపై వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్లు, విద్యుత్ లైన్లు, ఇసుక, గ్రాైనెట్ క్వారీల తో ఈ ప్రాంతమంతా కాలుష్య కాసారంగా మారింది. ఒ కప్పుడు పరిశుద్ధజలంతో, ప చ్చని పరిసరాలతో పక్షుల రాకపోకలకు ఎలాంటి ఆటం కాలు లేకుండా విహరించేం దుకు వీలుగా ఉండే అమీన్‌పూర్ సరస్సు నేడు పెద్దయెుత్తున కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. ‘సర స్సు పరిసరాలను పరిశుభ్రం చేయడమొక్కటే ఇందుకు పరిష్కార మార్గం. సరస్సు ప రిరక్షణలో భాగంగా టీఎస్‌ఎస్‌పీఎఫ్ గార్డులు నిరంతరం కాపలా ఏర్పాట్లలో ఉన్నారు. వ్యూహాత్మ క ప్రవేశ ద్వారాల వద్ద వారు అప్రమత్తతతో రక్ష ణ బాధ్యతలు చేపడుతున్నారు. సెలవు దినాల్లో ఆ ప్రాంత శుభ్రతను కాపాడేందుకు కృషిచేస్తున్నా’రని తేజ్‌దీప్ తెలిపారు. వారికి హెచ్‌బీపీ, ఎఫ్‌ఓఎఫ్‌ఎఫ్ వాలంటీర్లు సహకారం అందిస్తున్నా రు. పరిసరవాసులను చైతన్యం చేస్తున్నారు. సర స్సు పరిశుభ్రత అవసరాన్ని నొక్కిచెబుతున్నారు. సురక్షిత చేపల వేటకు సంబంధించి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ సరస్సు కేవలం సాగునీటి సరస్సు మాత్రమే కాదని, ఈ సరస్సును కాకతీయ పథకం పరిధిలోకి తెచ్చే అవకాశాలున్నాయని తేజ్‌దీప్ చెప్పారు. గ త నవంబర్‌లో ఈ సరస్సు జీవైవెవిధ్య వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. 

రైతు రూపంలో బెంగళూరు టెకీలు 
పిల్లలు కూరగాయ మొక్కలను పెంచడం ద్వారా వాటిపై వారిలో పేరుకుపోయిన విముఖత్వాన్ని తొలగించవచ్చు. తాము నీరుపోసి పెం చుతున్న మొక్కలు పెరుగుతున్న కొద్దీ వారిలో ఆసక్తి కూడా ద్విగుణీకృతమవుతుంది. బెంగళూరు కామరాజ్ రోడ్డులోని బెంగళూరు ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 14 ఎకరాల ప్రాంగణం చూస్తుంటే కేరట్, బొప్పా యి, కలబంద మొక్కలతో పచ్చదనపు పరిమళాలు వెదజల్లుతూ కనిపిస్తుంది. ఈ స్కూల్ ప్రాంగణం గార్డెన్‌ను సుందరంగా ఆకర్షణీయ మొక్కల తో నింపుతున్నారు. దీర్ఘచతురస్రాకారంలో ప్లాట్లువేసి స్కూల్ ప్రవేశ ద్వారం నుంచి పాలకూర, మిర్చి, బెండ, ముల్లంగి మొక్కలు వేశారు. ఈభూమిలో ఎన్నో ఏళ్ల నుంచి నిమ్మ, నారింజ చెట్లను పెంచుతున్నారు. కమ్యూనిటీ గార్డెన్ రూపుదిద్దుకునేలా చర్యలు తీసుకునేందుకు స్కూల్ యం త్రాగం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జూన్ నెలలో ప్రతి విద్యార్థి కూరగాయలను విక్రయిస్తారు. ఈ మాసోత్సవాన్ని వ్యాన్ మహోత్సవ్ అంటారు. ఇలా సేకరించిన ధనాన్ని ఈ పథకానికి మూలధనంగా పరిగణిస్తారు. 

ఇందులో కొంతభాగం స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఈ పథకంలో ఇప్పటి వరకు 32 వేల రూపాయలు సమకూరాయి. ఇందులో కొంతభాగాన్ని గార్డెనింగ్ ఖర్చులుగా వినియోగిస్తారు. ఈ స్కూల్‌ను గ్రీన్‌జోన్‌గా రూపుదిద్దాలని ప్రిన్సిపాల్ మంజులా రామన్ అభిలషిస్తున్నారు. ఆహార పదార్థాలకు సంబంధించిన మొక్కలకు ప్రోత్సాహమిస్తున్నారు. మొక్కల సంరక్షణ అవసరాన్ని వివరించేందుకు స్కూల్ విద్యార్థులు, టీచర్లు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఎండిన ఆకులు, ఆహార వ్యర్థాలను స్కూల్ ఆవరణలో కంపోస్టుగా మారుస్తున్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతలు విద్యార్థులు చూస్తారు. 

ఊట ఫ్రమ్ యువర్ తోట
బెంగళూరులో నూతన ఆకులు చిగురింపజేసేలా తీసుకోవలసిన ప్రతి ఒక్క చర్య నూ చేడుతున్నారు. నగరానికి ఉన్న చెత్తనగరం అన్న అపవాదును తొలగిం చేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. నగరాన్ని గార్డెన్ సిటీగా రూపొందించాలన్న స్ఫూర్తితో కృషిచేస్తున్నారు. నగరంలోని అపార్టుమెంట్ ఆరో అంతస్తులో కుండీల్లో బెండ తదితర కూరగాయల్ని పం డిస్తున్నారు. తమ బంగళాలను వ్యక్తిగత అడవులుగా భావిస్తున్నారు. వైట్ ఫీల్డ్ ప్రాంతంలో నివశిస్తున్న ఉద్యోగులు, ఐటీ నిపుణులు ప్రస్తుతం వారాంతపు రైతుల అవతారం ఎత్తుతున్నారు. ఇందుకోసం కొంతమంది సహకార వ్యవసాయాన్ని ఆశ్రయిస్తున్నారు. గార్డెన్ సిటీ ఫార్మర్స్ నుంచి ‘ఊట ఫ్రమ్ యువర్ తోట’  అనే నినాదం ఇప్పుడు సర్వసాధారణైమెంది. ఈ నినాదంతో సేంద్రీయ పద్ధతిలో గార్డెనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. 
- మథనం డెస్క్

English Title
eco friendly warriors
Related News