హంస వాహనంపై దుర్గమ్మ

Updated By ManamThu, 10/18/2018 - 20:03
 Dussehra festival: Hamsa Vahanam floats on the River Krishna
  • కృష్ణానదిలో వైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం

 Dussehra festival: Hamsa Vahanam floats on the River Krishna విజయవాడ : నవరాత్రులు పూజలు అందుకున్న దుర్గమ్మ విజయదశమి సందర్భంగా కృష్ణానదిలో హంస వాహనంపై విహరించారు. హంస వాహనంపై ఊరేగుతున్న దుర్గమ్మను చూసి భక్తులు తరలించారు. కాగా అంతకు ముందు స్వామివార్లు ...నగరోత్సవంగా అర్జునుని వీధిలో నుంచి బయలుదేరిన వినాయకుడి గుడి మీదుగా దుర్గా ఘాట్ కు చేరుకుంది.  హంస వాహనంపై అత్యంత ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

 Hamsa Vahanam floats on the River Krishna

హంస వాహనాన్ని విద్యుత్తు కాంతులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దుర్గా ఘాట్ మొత్తం భక్త సందోహంతో నిండిపోయింది. హంస వాహనం పై నుంచి ఆలయ అర్చకులు కృష్ణా నదికి హారతి అందచేశారు. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు దూప, దీపలను అందచేశారు. ఈ వేడుకలలో ఆలయ ఈఓ వి. కొటేశ్వరమ్మ, ఆలయ ఛైర్మన్ గౌరంగబాబు, నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు, జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. అత్యంత రమణీయంగా తెప్పోత్సవం కార్యక్రమం శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. 

అన్ని సమన్వయ శాఖల ఆధ్వర్యంలో చక్కని ఏర్పాట్లు చేశారు. హంస వాహనంపై అమ్మవారి ఉరేగింపును, హంసవహనానికి అనుసంధానం పంటూ సిద్ధం చేశారు. వాటిపై కమిటీ సభ్యులకు, సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కమిటీ సభ్యులుకు ప్రత్యేక బోట్  వాహనం (భోది) ని, మీడియా కోసం మరో ప్రత్యేక లాంచీ ఏర్పాటు చేశారు.

English Title
Dussehra festival: Hamsa Vahanam floats on the River Krishna
Related News