‘దుర్మార్గుడు’ ఫస్ట్‌లుక్ విడుదల

Updated By ManamSat, 05/26/2018 - 22:59
image

imageఎ.ఎ.ఎ. సినిమాస్ సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ పతాకంపై రాజవంశీ  నిర్మిస్తున్న చిత్రం ‘దుర్మార్గుడు’. సునీత్ జంపా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేయగా, మోషన్ పోస్టర్‌ను తుమ్మలపల్లి రామసత్య నారాయణ, టీజర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. అనంతరం చిత్ర నిర్మాత రాజవంశీ మాట్లాడుతూ ‘‘ఒక మంచి సబ్జెక్ట్‌తో సినిమా చేయాలనే ఉద్దేశంతో ‘దుర్మార్గుడు’ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మిక్సింగ్ లో ఉంది. జులైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘టీజర్ చాలా బాగుంది. పూర్తి మాస్ లుక్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది.. తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. దర్శకుడు సునీత్ జంపా మాట్లాడుతూ ‘‘6నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసి 35 రోజులు  కష్టపడి దుర్మార్గుడు చిత్రాన్ని తెరకెక్కించాం. జనాలకు నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు. బెక్కం వేణుగోపాల్, తుమ్మల పల్లి రామసత్యనా రాయణ, కో ప్రొడ్యూసర్ బాల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను,  అభినందనలను తెలియచేసారు. 

English Title
durmargudu' first look release
Related News