అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం

Updated By ManamTue, 10/16/2018 - 05:49
durga-temple
  • అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

durga-templeవిజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీదుర్గామలేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆరవ రోజైన సోమవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జయహో...దుర్గాభవానీ...నామంతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనించింది. అన్నం సర్వజీవనాధారం అటువంటి అన్నాన్ని ప్రసాదించే శ్రీఅమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించి తరించేందుకు వేకువజామునే భక్తులు బారులు తీరారు. సకల జీవరాశులన్నింటికి ఆ తల్లి కాశీ అన్నపూర్ణమ్మ సమస్త లోకాన్ని కాపాడమని మనసారా భక్తకోటి వేడుకొన్నారు. దేవస్థానం అధ్వర్యంలో మహా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కుంకుమ పూజలో ఉభయదాతలు పూజలు నిర్వహించారు.

వర్షం కురిసినా..
సోమవారం మధ్యాహ్నం వర్షం కురిసినా భక్తులు వర్షంలో తడుస్తూ జగజ్జననీ...జైజై జగజ్జననీ అంటూ ముందుకు సాగారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 97 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఇఓ కోటేశ్వరమ్మ తెలిపారు. అలాగే అన్నపూర్ణా దేవి అవతారం రోజున దుర్గమ్మ అన్నప్రసాదాన్ని 14,185 మంది స్వీకరించినట్లు తెలిపారు.

English Title
Durgamma Darsham
Related News