కాలజ్ఞానతత్వం యోచన పాట

Updated By ManamMon, 10/15/2018 - 05:05
Yochana

ఒక్కో కులం ఎట్లా దాడికి గురైందో, ఎంతగా చితికి పోయిందో యోచన లోతుల్లోకి పోయి ఆలోచిస్తాడు. కళ్లు చెమర్చే విధంగా కవిత్వీకరించి మన ముందు నిలబెడతాడు. కొన్ని బీసీ కులాల గురించి యోచన వర్ణించిన తీరు చూస్తే, ఆ కులాలకైనా అన్ని విషయాలు తెలుసోలేదో అనే డౌట్ వస్తుంది. అంతగా ఆయా కులాల మీద రీసెర్చ్ చేసి పాటలు రాశాడు యోచన. నిజానికి యోచన రాసిందంతా భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్రే. అన్యాయం జరిగిన ప్పుడాల్లా తనలో ఉన్న ఆలోచనపరుడు గొంతెత్తి నడిబజా రులో పాటై ప్రవహిస్తాడు. ఎందుకు ఇంత నిబద్ధత అంటే యోచనకు బాధితుల పట్ల ఎడతెగని ప్రేమ. ఆడపిల్లల నుండి ముసలి అవ్వల వరకు దళితుల నుండి బీసీ గిరిజన కులాల వరకు తనది బాధిత పక్షం. 


Yochanaఆధునిక ఉద్యమ కాలాల్ని వెలిగించింది పాట. ప్రజా చైతన్య వాహికగా చారిత్రక పాత్రను పోషించింది. అధిపత్యం, అణిచి వేత ఉన్నచోట తిరుగుబాటు పుట్టుకొస్తుంది. ఈ నేపథ్యం లోనే ఆందోళనలు, పోరాటాలు, ఉద్యమాలు కూడా రూపొం దండం అనివార్యమైన విషయం. గడిచిన వందేండ్ల తెలం గాణ ఉద్యమాల చరిత్రలో పాట పోషించిన పాత్ర విస్మరిం చలేనిది. అట్లా ఉద్యమ పాట శాశ్వత చిరునామా తెలంగాణే అయ్యింది. వేలయేండ్ల జానపద మౌఖిక సాహిత్య వార సత్వంగా పాట కొనసాగుతూనే ఉంది. సామూహిక విముక్తి కోసం పాట పోరాట పాటగా, ఉద్యమ పాటగా రూపాంతరం చెందింది. అందుకే పాటలేని తెలంగాణ ఉద్యమాల చరిత్ర లేదు. పాటంటే తెలంగాణ, తెలంగాణ అంటే పాటే. 

ఉద్యమాలకు ప్రజా మద్ధతును కూడగట్టడానికి ఇక్కడ పాటే ప్రధాన ఆధారంగా నిలిచింది. తెలంగాణ సాయుధ పోరాటం కంటే ముందు నుండే ఇక్కడ పోరాట పాట ఉంది. అది సాయుధ రైతాంగ కాలం నాటికి ఒక సామూహిక రూపం తీసుకుంది. ప్రజా విముక్తే ప్రధాన లక్ష్యంగా ఉద్యమ పాట సృజించబడింది. ప్రజా ఉద్యమాల్లోనే కాదు, ప్రజల జీవితాలపై చెరగని ముద్రను వేసింది. ప్రజల్లోని ప్రజా కళాకారులు ప్రజా విముక్తిని కోరుతూ చేసిన సేవ అద్వితీయ మైంది. తెలంగాణ నేల ప్రజా చైతన్యపదును తెలుసుకోవా లంటే ఉద్యమ పాటే మనకు దిక్సూచిలా ఉపయోగపడు తుంది. ప్రజా జీవితాన్నే కాదు, ప్రజల జీవిత మార్పునకు కావాల్సిన ప్రజా రాజకీయాలను సైతం బోధించింది పాటే. 
భారతదేశం అధిక నిరక్షరాస్యత కలిగిన దేశం. ఇలాంటి నేపథ్యంలో ఇతర సాహిత్య ప్రక్రియల ద్వారా సామాన్యు లను కదలించడం సాధ్యం కాదు. కానీ, పాటతో తెలంగాణ ప్రజలకు ఉన్న సుదీర్ఘ అనుబంధానికి తోడు, రంజింపజేసి, ఆలోచింపజేసే లక్షణం కలిగి ఉండడం వల్ల పాట మాత్రమే అత్యధికంగా విజయవంతం కాగలిగింది. ఒక పోరాట పాట ఏం చేయగలదో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నిరూపిం చింది. అరవయేండ్లుగా చేసిన ఉద్యమాన్ని గమ్యానికి చేర్చిన ఘనత పాటకు మాత్రమే దక్కింది. పాట సాయుధ రైతాంగ పోరాటంలో చిగురులు వేసి, విప్లవోద్యమ కాలం నాటికి మహావృక్షంగా విస్తరించింది. అస్తిత్వ ఉద్యమాల వెలుగులో శాఖోపశాఖలుగా చీలి, బాధితుల పక్షాన గొంతెత్తింది. మళ్లీ మలిదశ తెలంగాణ ఉద్యమం రాజుకోవడానికి పాటే గోరుకొ య్యల పొద్దై ప్రజలను మేల్కొలిపింది. ఇలాంటి పాట చరి త్రకు తమ కలాలను అందించి ఉద్యమాలకు మద్ధతు కూడ గట్టిన ప్రజా వాగ్గేయకారులు ఎందరెందరో. ఈ ప్రజావాగ్గేయ సంప్రదాయంలో ప్రధానంగా మూడు దశలున్నాయి.
1.తొలి తరం/రైతాంగ పోరాటతరం వాగ్గేయకారులు
2.విప్లవోద్యమ తరం వాగ్గేయకారులు
3.మలిదశ తెలంగాణ ఉద్యమ తరం/వర్తమాన తరం వాగ్గేయకారులు
తెలంగాణ ఉద్యమకాలంలో అందివచ్చిన వాగ్గేయ కారుడు యోచన. ఆలోచన కలిగించే పాటల జీవధార యోచన. పాటకున్న శక్తిని గుర్తించినవాడు. 

పాటను ఈటెలా విసిరినవాడు. ఆధిపత్య వర్గాల పాట ద్వారా అగ్గై మండిన వాడు. ప్రజలను ఆలోచింపజేసి, సమాజ మార్పునకు పాట దారులు వేస్తుందనే నమ్మే ఈ కాలపు వాగ్గేయకారుడు. పాటను భుజాన వేసుకొని గడిచిన రెండు దశాబ్దాలుగా ముందుకు సాగుతున్నవాడు. తెలుగు సమాజంలో అత్యంత కీలకమైన ఈ రెండు దశాబ్దాల కాలానికి మాదన్నపేట అం దించిన ప్రజాకవి యోచన. చారిత్రక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కలిగిన నర్సంపేట తాలూకాలో ఒక చిన్న గ్రామం అది. అలాంటి మాదన్నపేట ఊరి నుండి తన కంటే ముందు తన తండ్రి కళాకారుడు. ఆయన సాధా రణ జానపద కళాకారుడు కాదు. గుండెల నిండా పోరాట ఊపిరి నింపుకున్న ఉద్యమ కళాకారుడు. పేరు బ్రహ్మచారి. ఆ మహా కళాకారుడైన బ్రహ్మచారి కొడుకే ఈ పాటల ప్రవాహ రూపమైన యోచన.   
1991 నుండి మొదలయ్యాయి గ్లోబలైజేషన్ పరిణా మాలు, ప్రజా వ్యతిరేక విధానాలు. అవి యోచనను ఎంత గానో ఆలోచింప జేశాయి. తన కళ్ల ముందే పల్లె విధ్వంసం కావడాన్ని గుర్తించినవాడు. సమస్త జీవన రంగాలను కబ లించివేస్తున్న గ్లోబలైజేషన్‌ను ఎదుర్కొవడానికి పోరాటమే మార్గమని నమ్మాడు యోచన. వాయిదాల పద్ధతిలో తన చుట్టూ ఉన్న మనుషులు పతనమవుతున్న తీరుకు అల్లాడిపో యాడు. నమ్ముకున్న కులవృత్తి అంతర్జాతీయ కుట్రల దెబ్బ లకు కుదేలైనపుడు దాని మూలాల గుట్టును విప్పి చెబు తాడు. ఆకలి చావులు, అకాల మరణాలు చూసి కలత చెందుతాడు. మనిషి మార్కెట్ సరుకుగా మారుతున్న తీరును చూసి ఆవేదన చెందుతాడు. ఆధిపత్య కులాల, వర్గాల తాకిడికి బలహీనులు చతికిలపడడం చూసి అదిగో అప్పుడు పాట రాయడం మొదలు పెడతాడు. 
ఉద్యమ పాటే కాదు, ఉద్యమ సాహిత్యం కూడా తక్షణ స్పందనలో భాగమే. అందులో సాహిత్య పాళ్లు తక్కువని విమర్శకులు వాపోతుంటారు. కానీ, ఇది పాక్షిక సత్యం మాత్రమే. యోచన వంటి ప్రజాకవులకు సాహిత్యం తెలుసు. పాటను కవిత్వంతో నింపడం తెలుసు. అందులో సిద్ధహ స్తుడు యోచన. ఎంతటి డ్రై సబ్జెక్టును ఎంచుకున్నా.. దానికి కవిత్వ పరిమళం అద్దగలిగిన అతికొద్దిమంది సృజనకారుల్లో యోచన ముందు వరుసలో ఉంటాడు. పోరాట పాటల్లో ఆవేశం పాలు ఎక్కువగా ఉంటుంది. ఆ సందర్భంలో కవిత్వం పలికించలేము. ఇది సాధారణంగా అందరి మెదళ్లలో ఉన్న మాట. కానీ, దీన్ని బద్ధలు కొడుతూ యోచన మనల్ని మంత్రముగ్ధులను చేస్తాడు. పాటంటే వినడం వల్లనే రసానుభూతి కలుగుతుంది. కానీ, యోచన అలా కాదు, ఆయన రాసిన పాటలను చదువుతున్నా సరే మనల్ని మనం మరిచిపోతం. అంటే యోచన కవిత్వానికి ఆ శక్తి ఉంది. అందువల్లనే ఇవి సజీవమైన పాటలుగా నిలువగలుతున్నాయి. 

యోచన పాట రాసేటపుడు బాణీ మీద కంటే కవిత్వం మీద ఎక్కువ దృష్టిని పెడతాడు. చెప్తున్న వస్తువును సజీవంగా వర్ణించగలుగుతున్నామా లేదా అన్నదే చూస్తాడు. అందు కే తన పాటలకు ఒక శాశ్వతత్వం కలుగుతున్నది. తనకు సమాజమే వస్తువు. మనల్ని నిద్దుర లేపే గోరుకొయ్యల పొద్దు నుండి కాకుల అరుపుల నుండి మొదలు కుటుంబం, సమాజం, ప్రకృతిలోని ప్రతీ జీవి యోచనకు వస్తువులే. ప్రాణంలేని వస్తువుల్లో సైతం ప్రాణాన్ని చూడగల కవితా హృదయం తనది. చలనం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించి వర్ణిస్తాడు. పాట వింటున్నవారిని మరో లోకాలకు చెయ్యి పట్టుకొని తీసుకుపోతాడు. 
‘‘తడిసిన పొయ్యిరాళ్ల మధ్యతల్లడిల్లే మంటజూపి
పొగను ఆప పొయిల గొట్టంఊపిరాడక దగ్గుతుంది
ఆకలంతా సచ్చినంకానూకలా జావుడుకుతుంది
బతుకునంతా తలుసుకుంటూగుండెబరువెక్కుతుంది’’ (మొసమర్రిన పాట) అంటాడు. మంట మండడానికి పొగ ఊదే గొట్టం ఊపిరాడక దగ్గుతుంది అనడంలోనే యోచన కవితాశక్తి యిమిడి ఉంది. ఇక ఉల్లిగడ్డ, ఉప్పు, కందిపప్పు, చెప్పు, డప్పుల గురించి వర్ణించేటపుడు కూడా యోచన ఇట్లాగే వాటిలో ప్రాణాన్ని దర్శించి వర్ణిస్తాడు. ఇట్లా పాటం తా కవిత్వమయం చేయడం సీనియర్ వాగ్గేయకారులకే సాధ్యం. ఈ తరం వాగ్గేయకారులో చాలా తక్కువమందికి మాత్రమే ఇంతటి కవితాశక్తి అలవడింది. 

‘రైతు’ అనే మరో పాటలో ‘‘భూమిపై మానవ జాతికి బువ్వపెట్టే అవ్వ రైతు’’ అంటాడు. బహుశా తెలుగు సాహిత్యంలో రైతును తల్లిగా భావించిడం కొత్త పోలిక. అది యోచనకు మాత్రమే సాధ్యమయ్యింది. అలాగే రైతు పుట్టెడు కష్టం చేస్తే చేనుకు పూత పూయలేదుగాని, రైతు చేతులకు మాత్రం కాయలు కాశాయి అంటాడు. ఇట్లా తన చుట్టూ ఉన్న సమాజాన్ని సామాజిక బాధ్యతతో కవిత్వీకరిస్తున్నాడు యోచన. యోచనది తాత్విక చింతన. అందరు ఆలోచించినట్టు ఆలోచించడు. అలాగే మిగిలిన కవులు, కళాకారుల కంటే భిన్నంగా లోతుగా ఆలోచించి మనకు ఈ లోకాన్ని అర్థం చేయిస్తాడు. అప్పటి వరకు మనకు తెలిసిన విషయాల్లోనే తెలియని ఎన్నో కోణాలను ఒడిసి పట్టుకుంటాడు. ఎంతో వయసు గడిస్తే తప్ప అంతుపట్టని జీవనసూత్రాలను అలవోకగా అచ్చంగా పోతులూరి వీరబ్రహ్మం చెప్పినట్టుగానే బోధిస్తాడు. కమ్యూనిజంలో ఉండే పునాది, ఉపరితల అంశాల విభజనకు మించింది యోచన తాత్విక చింతన. లేకుంటే పశు పక్ష్యాదుల్లో సైతం ఇంత జీవితాన్ని దర్శించడం సాధ్యమయ్యేది కాదు.

‘‘పత్తి పానుపులాంటి మబ్బు పగులకొట్టునెవరో
పాలపొదుగు పిసికినట్లు నేల నెట్ల జారె చినుకు
ఆకాశాన్ని అటుకు జెసి గంగ నెవరు దాచిరాడ
వానకాల మొచ్చెదాక కదలకుండ ఎట్ల మోసె’’ (పరిణామము పాట) అంటాడు.
ఇది అందరికి తెలిసిన విషయమే. అయినా మనం ఈ విషయాలను పట్టించుకోం. వర్షం కురుస్తుంటే దాని వెను కాల జరిగిన పరిణామం గురించి తాత్వికుడైన ఒక కవి మాత్రమే ఇట్లా ఆలోచించగలడు. వచన కవులు కూడా ఇంత తాత్వికంగా ప్రశ్నించడం అరుదు. ఈ చరణంలో ఆకాశాన్ని అటుకు చేశారంటాడు యోచన. అక్కడ గంగను దాచిపెట్టారనే పోలికను మించిన కవిత్వం ఇంకేముంటుంది. అట్లా వర్ణిస్తూనే వానకాలం వచ్చేదాకా దాన్ని కదలకుండా మేఘం ఎట్లా మోస్తుందోనని తాత్వికంగా ప్రశ్నిస్తాడు. యోచనకు ఈ దృష్టి కోణం అలవడడం వెనకాల ఈ ప్రకృతి పట్ల, సమాజం పట్ల తీవ్రమైన ప్రేమ, ఆర్ధ్రత ఉన్నాయి. అందుకే పాట రాయడానికి ఎన్నుకున్న ప్రతీ వస్తువు పట్ల విపరీతమైన బాధ్యతను చూపిస్తాడు. ఇది సాధారణ బాధ్యత కాదు. సామాజిక బాధ్యత. తన చుట్టు ఉన్నవారిలో ఒక్క కన్నీటి చుక్క కారినా, అది చూసి ఆవేదన చెందుతాడు. ఆలోచిస్తాడు. దోపిడి మూలాల గుట్టును పాట కట్టి బయటపెట్టే వరకు నిదురపోడు. అందుకే యోచనలో ఉన్న ఈ కన్‌సెర్న్‌కు ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. 

కుల పునాదుల మీద నిర్మితమైన భారత సమాజం కుట్రపూరితంగా సమాజంలోని అత్యధికులను ఆకలి, అవ మానాల పాలు చేసింది. దీంతో కొందరు దళితులుగా, చేతి వృత్తుల వారిగా, గిరిజనులుగా, మహిళలుగా, బలహీను లుగా మార్చబడ్డారు. ఈ కుట్రకు యోచన విలవిలలాడు తాడు. అణగారిన వారి పక్షాన నిలబడి అక్షరాలు కురిపి స్తాడు. ప్రశ్నలు వేసి, తాత్విక చింతనతో రగిలిపోతాడు. బాధితులకు తన మద్ధతును తెలుపడం యోచన జీవన విధానం. కేవలం ఓదార్చడం మాత్రమే ఈ వాగ్గేయకారుని లక్ష్యం కాదు. బాధితుల దు:ఖానికి మూలం ఎక్కడుందో కనుగొంటాడు. అట్లా యోచన వ్యక్త పరిచిన కన్‌సెర్న్ ప్రజా స్వామిక ఉద్యమకారుని కన్‌సెర్న్. అందుకే 1990లలో మొదలైన గ్లోబలైజేషన్ విధ్వంసం గురించి తీవ్రంగా స్పందించాడు. అనేక బాధిత సమూహాల మీద పలు పాటలు సృజించాడు.


గ్రామ సామాజిక స్వరూపానికి ఆధారంగా నిలిచే దళిత, బహుజన కులాల మీద యోచన బలమైన పాటలు రాశాడు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో చితికిపోతున్న కులాల చరిత్రను, వర్తమానాన్ని బేరీజు వేసి వారికి మద్ధతు తెలియజేస్తాడు. అట్లా రచించినవే చాకలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మం గలి, గౌడ, వడ్డెర కులాల మీది పాటలు. ఈ కులాల దీన స్థితిని చెప్తూ యోచన, పరిష్కార మార్గం చెప్పడు. విషయ తీవ్రతను చెప్పి బాధిత సమూహాలకే పరిష్కారాన్ని వదిలే స్తాడు. వారినే తేల్చుకొమ్మంటాడు. ఇది కూడా సరికొత్త పం థానే. ఉద్యమపాటల ముగింపుల్లో ఇది చెయ్యి, అది చెయ్య మనే ప్రబోధాలు పాతబడ్డాయి. వాటి స్థానంలో ఈ రకమైన ధోరణిని ప్రవేశ పెట్టినవాడు గోరటి వెంకన్న. ఆ పంథాను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్నవాడు యోచన.  ఒక్కో కులం ఎట్లా దాడికి గురైందో, ఎంతగా చితికి పోయిందో యోచన లోతుల్లోకి పోయి ఆలోచిస్తాడు. కళ్లు చెమర్చే విధంగా కవిత్వీకరించి మన ముందు నిలబెడతాడు. కొన్ని బీసీ కులాల గురించి యోచన వర్ణించిన తీరు చూస్తే, ఆ కులాలకైనా అన్ని విషయాలు తెలుసోలేదో అనే డౌట్ వస్తుంది. అంతగా ఆయా కులాల మీద రీసెర్చ్ చేసి పాటలు రాశాడు యోచన. నిజానికి యోచన రాసిందంతా భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్రే. అన్యాయం జరిగిన ప్పుడాల్లా తనలో ఉన్న ఆలోచనపరుడు గొంతెత్తి నడిబజా రులో పాటై ప్రవహిస్తాడు. ఎందుకు ఇంత నిబద్ధత అంటే యోచనకు బాధితుల పట్ల ఎడతెగని ప్రేమ. ఆడపిల్లల నుండి ముసలి అవ్వల వరకు దళితుల నుండి బీసీ గిరిజన కులాల వరకు తనది బాధిత పక్షం. 
(ఇంకా వుంది)

Tags
English Title
Duration of Knowledge
Related News