‘యాత్ర’కు ప్రారంభమైన డబ్బింగ్

Updated By ManamThu, 07/12/2018 - 14:33
yatra

Yatraఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇందులో రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి మరోవైపు డబ్బింగ్ కూడా ప్రారంభమైంది. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తుండగా.. అందుకు తగ్గట్లుగా షూటింగ్‌తో పాటు మిగిలిన పనులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, రావు రమేశ్, సుహాసిని, పోసాని కృష్ణమురళి, భూమిక, అనసూయ, సచిన్ కేడ్కర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కే సంగీతం అందిస్తున్నారు. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

English Title
Dubbing works started for Yatra..?
Related News