పెళ్లిపీటలెక్కబోతున్న చెస్ దిగ్గజం

Updated By ManamWed, 06/13/2018 - 08:51
harika

Harika గుంటూరు: భారత చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక పెళ్లిపీటలెక్కబోతోంది. కార్తీక్ చంద్ర అనే సివిల్ ఇంజనీర్‌తో హారికకు పెళ్లి నిశ్చయించారు ఆమె తల్లిదండ్రులు. వీరి నిశ్చితార్థం ఈ నెల 18న హైదరాబాద్‌లో జరగనుండగా.. ఆగష్టు 19న వివాహం జరగనుంది.

అయితే 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌ను గెలిచిన హారిక, 2001లో గ్రాండ్ మాస్టర్ హోదాను సంపాదించుకుంది. అలాగే కామన్వెల్త్, ఆసియా ఛాంపియన్‌గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 సంవత్సరాలలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలను సాధించింది. కాగా ఈ ఏడాది మార్చిలో ఏపీకి చెందిన చెస్ క్రీడాకారుడు హరికృష్ణ సెర్బియన్‌కు చెందిన తన ప్రియురాలు నదేజ్డా స్నోజనోవిక్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

English Title
Dronavalli Harika going to marry
Related News