కల నేరవేరింది 

Updated By ManamWed, 06/13/2018 - 23:50
ram

image‘సినిమా చేయడానికి ముందే ‘నా సినిమా హిట్’ అని సినిమా చేస్తారా? ఎవరూ చేయరు కదా. సినిమా చేసే ప్రతి ఒక్కరూ సినిమా హిట్ అవుతుందనే ఆలోచనతోనే చేస్తారు. అలా చూస్తే ప్రతి సినిమా రిస్కే’’ అని అంటున్నారు కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్. ఈయన హీరోగా నటించిన ‘నా నువ్వే’ నేడు విడుదలైంది. తమన్నా హీరోయిన్. జయేంద్ర దర్శకుడు. సినిమా విడుదల సందర్భంగా కల్యాణ్ రామ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నాది, తమన్నా పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. నా పాత్ర విషయానికి వస్తే.. పి.హెచ్.డి చదివి యు.ఎస్ వెళ్లాలనుకునే యువకుడిగా కనపడతాను. ఇది పూర్తిస్థాయి రొమాంటిక్ చిత్రం. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లోనే ఎక్కువగా నటించాను. తొలిసారి ‘నా నువ్వే’ వంటి రొమాంటిక్ చిత్రం చేయడం కొత్త అనుభూతినిచ్చింది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని వేగంగా కనిపిస్తాయి. కానీ, ఈ సినిమాలో సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే జయేంద్రగారి స్కూల్ వేరేగా ఉంటుంది. సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ చేయాలి. కళ్లు పెద్దవి చేయకూడదు. చేతులు ఎక్కువగా ఊపకూడదు. ఎక్కువగా డైలాగ్స్ చెప్పకూడదు. ఇలాంటి కండీషన్స్ ఎక్కువగా ఉంటాయి. డైలాగ్ చెప్పడం కంటే ఎలా  ఎక్స్‌ప్రెస్ చేశామనేదే ముఖ్యం.

ఈ విషయాల్లో జయేంద్రగారు, పి.సి.శ్రీరామ్‌గారు ఎంతో కేర్ తీసుకున్నారు. పి.సి.శ్రీరామ్‌గారు నాకెంతో ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ ఆయనతో మనం సినిమా చేయగలమా? అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ కల నేరవేరింది. ఈ సినిమాలో నా లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ‘అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఎక్కువ అందంగా ఉన్నావు నాన్నా!’ అని నా కొడుకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. అదే గుడ్ కాంప్లిమెంట్. ఇప్పటి వరకు నా సినిమాల్లో నేను ఎప్పుడూ మీసాలు తీసేయలేదు. ఏదో సినిమాలో తీయాల్సి వస్తే.. నా భార్యకు చెప్పాను. ‘ఎందుకండీ.. బావుండదేమో’ అనడంతో మానేశాను. అయితే ఈ సినిమాలో నా లుక్ చూసి చాలా బావుందని అన్నారు. తమన్నా చాలా ప్రొఫెషనల్. తను తప్ప మరో హీరోయిన్ ఉంటే చేయలేకపోయే వాడినేమో.

సెట్స్‌కు వెళ్లే ముందు నేను, తమన్నా రిహార్సల్ చేసుకునేవాళ్లం. ఖాళీ సమయాల్లో ఇద్దరం కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. నాకు బేసిక్‌గా ట్యాగ్‌లైన్స్ అంటే భయం. భవిష్యత్‌లో రొమాంటిక్ సినిమాలొస్తే చేయడానికి నేను రెడీ. వైవిధ్యమైన సినిమాలు చేయాలనుకుంటున్నాను. మహేశ్‌గారి వల్లనే కిరణ్, విజయ్‌లను కలిశాను. మేకింగ్‌లో కాంప్రమైజ్ కాకుండా సినిమాను అందంగా తెరకెక్కించడంలో వారి సహకారం ఎంతో ఉంది. నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై పవన్ సాధినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. గుణ్ణం గంగరాజుగారు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. మల్టీస్టారర్ మూవీ ఇది. 15 రోజుల తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణులు అన్ని విషయాలు తెలుస్తాయి. తారక్‌తో 2019లో సినిమా చేస్తాను. హీరోగా గుహన్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ జూలైకి నా పార్ట్ పూర్తవుతుంది. విరించి వర్మ కథ కూడా ఫైనల్ వెర్షన్ వినాల్సి ఉంది. ఆగస్టులో ఆ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి’’ అన్నారు. 

English Title
The dream has come true
Related News