ల్యాండ్‌పూలింగ్‌తో డబుల్ కల సాకారం

Updated By ManamFri, 11/09/2018 - 01:46
Double

imageహైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రభుత్వ అవసరాలకు భూమి సేకరించడం అంటే తలకు మించిన భారం. అందులోనూ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల లాంటి అతి భారీ ప్రాజెక్టుల విషయమైతే అసలు చెప్పనే అక్కర్లేదు. వాటికి చాలా ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టినపుడు భవన నిర్మాణ అనుమతులు, సాంకేతిక అనుమతులు, కాంట్రాక్టర్లను సమకూర్చడం, వనరుల సమీకర ణ.. ఇలా చాలా ఉంటాయి. వీటన్నింటికంటే అతి పెద్ద సమస్య భూసమీకరణ. అసలు ప్రాజెక్టు ఎక్కడ మొదలుపెట్టాలో నిర్ణయించుకోవాలన్నా కూడా భూమి అత్యంత ప్రాధాన్యమైన అంశం అవుతుంది.

జంట నగరాల పరిధిలో మొత్తం దాదాపు లక్ష ఇళ్ల వరకు నిర్మించాలని భావించారు. వాటన్నింటినీ బహుళimage అంతస్థుల అపార్టుమెంట్ల రూపంలో కట్టాలనుకున్నా కూడా ఎంత లేదన్నా కనీసం 600 ఎకరాల భూమి అవసరం అవుతుంది. గట్టిగా 200-300 గజాలలో ఇళ్లు కట్టుకుందామన్నా కూడా స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత కాలంలో ఏకంగా అంత పెద్ద మొత్తంలో భూమిని సేకరించడం అంటే నిజంగా తలకు మించిన భారమే అవుతుంది. అయితే, ఈ పథకం మొత్తానికి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా జీహెచ్‌ఎంసీని నియమించడంతో.. మొత్తం నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా సర్వే చేయించారు.

జిల్లాల యంత్రాంగంతో కూడా పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ భూములు అందుబాటుల ఉన్నాయో చూడటం మొదలుపెట్టారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో కూడా సమన్వయం చేసుకుంటూ.. తమ పని నిర్విఘ్నంగా సాగేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. బడుగులకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం తలపెడుతుండటంతో ఆ విషయాన్ని సమగ్రంగా వివరించి.. ఎట్టకేలకు గుర్తించిన బహిరంగ స్థలాలను అందరి నుంచి సేకరించగలిగారు. అంతేకాదు, ప్రస్తుతం నగరంలో ఉన్న 36 మురికివాడలలో నివసిస్తున్న వారికి కూడా పూర్తిస్థాయిలో నచ్చజెప్పి, అక్కడే వారు ఉంటున్న ప్రదేశంలోనే వారికి గౌరవప్రదంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి, తొలి ప్రాధాన్యంగా అక్కడ ఉండేవారికే ఇస్తామని చెప్పడం ద్వారా.. ఆ స్థలాలను సైతం సేకరించగలిగారు. మొత్తమ్మీద నగరం, చుట్టుపక్కల ప్రాంతాలలో అంతా కలిపి 109 ప్రాంతాలలో 600 ఎకరాల భూమిని డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ల్యాండ్‌పూలింగ్ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ సమీకరించగలిగింది. దాంతో అంతటి బృహత్తరమైన ప్రాజెక్టు కూడా సాకారం అయ్యేందుకు వీలుపడింది. 

English Title
Double duplex with landpooling
Related News