మహిళలూ.. శృంగారం చేయొద్దు

Updated By ManamThu, 06/14/2018 - 12:59
Dont Do Sex With Foreigners Says Russia Law Maker
  • విదేశీ పురుషులతో అస్సలు పాల్గొనొద్దు.. సంకరజాతి పిల్లలు పుడతారు: ఫిఫా సందర్భంగా రష్యా నేత ప్రకటన

fifa

మాస్కో: ‘‘మహిళలూ.. విదేశీయులతో శృంగారం చేయకండి. శ్వేతజాతీయులు కాని వారితో అస్సలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనకండి’’.. ఇదీ రష్యాకు చెందిన ఓ రాజకీయ నేత ఆ దేశ మహిళలకు ఇచ్చిన సలహా. అవును.. ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌నకు రష్యా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆటను చూడ్డానికి వచ్చే విదేశీయులతో సెక్స్‌లో పాల్గొనవద్దని కుటుంబ, మహిళా, శిశు సంక్షేమ పార్లమెంటరీ కమిటీ అధిపతి తమరా ప్లెన్యోవా అన్నారు. వారితో సెక్స్ చేస్తే ‘సంకర జాతి’ పిల్లలు పుడతారని, మహిళలు ఒంటరివాళ్లుగా మిగిలిపోతారని ఆమె అంటున్నారు. విదేశాల్లోనో లేదంటే సొంత దేశం రష్యాలోనో మహిళలు తరచూ చిక్కుకుపోతున్నారని, వారి పిల్లలను వారు దేశానికి తీసుకురాలేకపోతున్నారని ఆమె చెప్పారు.

‘చిల్డ్రన్ ఆఫ్ ఒలంపిక్స్’ అనే దానిపై ఓ రేడియోలో అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె ఈ సమాధానం ఇచ్చారు. 1980లలో మాస్కో గేమ్స్ సందర్భంగా రష్యా మహిళలు విదేశీయులతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల పుట్టిన పిల్లలు. సోవియట్ హయాంలో అంతర్జాతీయ కార్యక్రమాలు, క్రీడా పోటీల సందర్భంగా రష్యా మహిళలు.. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల వారితో శృంగారంలో పాల్గొన్నప్పుడు పుట్టే పిల్లలకు ఆ పేరును నిర్ధారించారు. దానిపైనే ప్లెన్యోవాకు ప్రశ్న ఎదురైంది. ‘‘మన పిల్లలకు మాత్రమే మనం జన్మనివ్వాలి. ఇలాంటి సంకర జాతి పిల్లల వల్ల సోవియట్ హయాం నుంచి కష్టాలు వస్తున్నాయి. నేను అలాంటి పిల్లల తరఫున మాట్లాడుతున్నాను. అలా పుట్టిన పిల్లలు చాలా నిర్లక్ష్యానికి గురవుతుంటారు. అందుకే విదేశీయులతో సెక్స్ వద్దంటున్నాను. కావాలంటే ఏ వర్గం నుంచి వచ్చినవారైనా సరే.. స్వదేశీయులనే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు’’ అని ఆమె చెప్పుకొచ్చారు. 

English Title
Dont Do Sex With Foreigners Says Russia Law Maker
Related News