ఐసీసీ మీటింగ్‌కు వెళ్లొద్దు

Updated By ManamTue, 10/16/2018 - 05:49
rahul-johri-bcci
  • ఆరోపణలకు వివరణ ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సీఈఓ జొహ్రీకి సీఓఏ సూచన

  • ‘మీ టూ’ ఉద్యమం

rahul-johri-bcciన్యూఢిల్లీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌కు రావద్దని లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బోర్డు సీఈఓ రాహుల్ జొహ్రీని బీసీసీఐ కోరింది. ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా జొహ్రీ తనను లైంగికంగా వేధించాడని ఓ అజ్ఞాత మహిళ ట్విట్టర్‌లో పేర్కొన్న అంశాన్ని మరో యూజర్ హర్నిధ్ కౌర్ షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) రాహుల్ జొహ్రీని వివరణ కోరుతూ మెయిల్ పెట్టింది. అంతేకాకుండా ఐసీసీ మీటింగ్‌కు రావడం కంటే వివరణ ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సీఓఏ కోరింది. దీంతో సింగపూర్‌లో రెండ్రోజులు జరగనున్న ఐసీసీ మీటింగ్‌కు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి హాజరు కానున్నారు. ఈ సమావేంలో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం, టీ20, టీ10 లీగ్స్ నిబంధనలపై ప్రధానంగా చర్చించనున్నారు. 

సీఈఓకు ఒక రూల్.. క్రికెటర్లకు మరో రూలా
ఇదిలావుంటే సీఈఓకు ఒక రూలు, క్రికెటర్లకు మరో రూలా అనే వాదన వినిపిస్తోంది. ఇటువంటి విషయాల్లో సీఓఏ కఠినంగా వ్యవహరించాలని కొంత మంది కోరుతున్నారు. ఓ క్రికెటర్ (మహ్మద్ షమీ)పై వచ్చిన ఆరోపణలకు అతని కాంట్రాక్‌ను నిలిపివేశారు. సీఈఓ విషయంలోనూ అదే రూల్స్ పాటించాలి కదా అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు అన్నారు. 

14 రోజుల వరకు ఆగలేం: వినోద్ రాయ్
ఆరోపణల విషయంలో సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తన నిర్ణయాన్ని వెలిబుచ్చుతూ.. ‘వివరణాత్మక వివరణ ఇచ్చేందుకు రాహుల్ 14 రోజుల సమయం కోరుతున్నారు. అంతేకాకుండా తన లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో జరగనున్న ఐసీసీ సమావేశానికి వెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నారు. కానీ అన్ని రోజులు ఆగడం కుదరదు’ అని రాయ్ చెప్పారు. 

మహిళపై వేధింపులు
అజ్ఞాత మహిళ పెట్టిన ట్విట్టర్‌ను మరో యూజర్ హర్నిధ్ కౌర్ షేన్ చేసింది. అందులో అజ్ఞాత మహిళ ఆరోపణలు ఏంటంటే.. ఓసారి జొహ్రీ భార్య సీమ ఇంట్లో లేని సమయంలో అజ్ఞాత మహిళను తన ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాంట్ విప్పేసి ఆ మహిళను వేధించాడు. ఆ సమయంలో షాక్‌లో ఉన్న తను ప్రతిఘటించలేకపోయాన ని, భయంతో వణికి పోయానని ఆ మహిళ పేర్కొంది. దీనిపై జొహ్రీ ఇంతవరకు స్పందించలేదు.

English Title
Do not go for ICC meeting
Related News