ఆ నిధులు మాకొద్దు

Updated By ManamFri, 11/09/2018 - 23:39
rbi
  • మిగులు నిధులు అడగట్లేదు

  • కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

  • లక్ష కోట్లు అడగలేదని వెల్లడి

  • ఆర్బీఐ-కేంద్రం మధ్య వివాదం

rbiన్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న మిగులు నిధులను తాము అడిగి తీసుకునే ఉద్దేశం ఏమీ తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆర్థిక మంత్రిత్వశాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఈ విషయాన్ని ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న నిధుల్లో లక్ష కోట్ల నుంచి రూ. 3.6 లక్షల కోట్ల వరకు తాము అడుగుతున్నట్లు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతా పట్టాలమీదే ఉందని, ఎక్కడా తప్పలేదని గార్గ్ తెలిపారు. మిగులు నిధుల విషయంలో.. రిజర్వుబ్యాంకుకు తగిన ఆర్థిక పెట్టుబడి విధానం ఉండాలనే చర్చిస్తున్నామని, దీనిద్వారా రిజర్వుబ్యాంకులో తగినంతగా మిగులు నిధులు ఉండేలా నిర్వహించేందుకు వీలుం టుం దని చెప్పారు. మిగులు నిధులు సహా పలు అంశాలపై ప్రభుత్వానికి - రిజర్వు బ్యాంకుకు మధ్య గత కొన్నాళ్లుగా వివా దం నడుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాం కులకు పెట్టుబడి, ఇతర అంశాలను సులభతరం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. గత కొన్ని వారాలుగా సర్కారు-ఆర్బీఐ మధ్య విభేదాలు పెరగడంతో దీనిపై ఈనెల 19న జరిగే బోర్డు సమావేశంలో చర్చిస్తారని అంటున్నారు. ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో మిగులు నిధులు అడగడం వల్లే గొడవ వస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి పి.చిదంబరం ఆరోపించారు. మిగులు నిధుల్లోంచి లక్ష కోట్లు చెల్లించాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ప్రభుత్వం బలవంతం చేసింద ని, కానీ ఆయన అందుకు నిరాకరించార ని చిదంబరం అన్నారు. ప్రభుత్వం మా త్రం ఒకవైపు ఆర్థికలోటు ఉన్నా, మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యయాలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

Tags
English Title
Do not get that funding
Related News