బాధితులకు ఆశాకిరణం.. వివాద పరిష్కార చట్టం

Updated By ManamTue, 10/23/2018 - 03:09
lok

imageఏ కేసులోనైనా బాధితులు కోర్టు తలుపు తట్టినపుడు ఆ కేసు పరిష్కారం సకాలంలో జరగకుంటే బాధితులు తీ వ్రంగా నష్టపోతారు. అందుకే ఆలస్యంగా జరిగే న్యాయం వ్యర్ధమే అంటారు న్యాయ నిపుణులు. ఈ నేపథ్యంలో అ లాంటి బాధితులకు ఆశాకిరణంగా నిలుస్తోంది ప్రత్యామ్నా య వివాద పరిష్కార చట్టం. 

మానవుని జీవనయానంలో ఆటుపోట్లు సహజమే. మనలో వుండే మానసిక త్రిగుణాలు (ఈడ్, ఇగో, సూపర్ ఇగో/ భారతీయ తత్వం ప్రకారం సత్వ, రజ, తమం), వాటి వ్యుత్పత్తులు, అత్యాశ, ఆధిపత్య ధోరణులు, సాంఘిక -కుటుంబ సంబంధబాంధవ్యాలు, ఆర్ధిక కారణాలు,  విలక్షణమైన వ్యక్తిత్వం, వేగంగా మారుతున్న జీవనశైలి - వంటి కారికకారణాల వలన ఒక మనిషి ఇంకో మనిషితో విబేధిస్తుంటాడు. మాట తప్పుతుంటాడు. బాధ్యతలను కర్త వ్యాలను విస్మరిస్తుంటాడు. దీనితో కష్టం/నష్టం వాటిల్లిన వారు దాన్ని పూడ్చుకోవటానికి న్యాయస్థానం తలుపు తట్ట టం మామూలే. 

imageఅసలు ఇబ్బందంతా ఇక్కడే వుంది. పడిన చిక్కుని విప్పటంలో జరిగే జాప్యం అసలు చిక్కుకంటే గొప్ప చిక్కులే తెచ్చిపెడుతుంది. పరిష్కార ప్రక్రియలో జరిగే విపరీ తమైన జాప్యం, న్యాయాన్ని సకాలంలో అందివ్వకపోవటం వంటి వాటిని కూడా ధర్మతృణీకరణగానే పరిగణించాలి. ఆలస్యంగా జరిగే న్యాయం వ్యర్ధం. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. ఒక నమ్మశక్యం కాని నిజమేమిటంటే ఇప్పటికే న్యాయస్థానాలలో పేరుకుపోయిన కేసులన్నిటిని పరిష్కరించ టానికి 300 సంవత్సరాలకంటే ఎక్కువే పడుతుందని ఒక అంచనా. అయినదానికీ, కానిదానికీ ‘నిన్ను కోర్టుకు లాగి ముప్పతిప్పలు పెడతా, మూడు చెరువుల నీళ్ళు తాగిస్తా, నా తఢాకా చూపిస్తా!’ అంటూ కోర్టు వివాదాలకు తెర లేప టం చాలామందికి పరిపాటిగా మారింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు, క్రిమినల్ నేరాలకు, ఏవో ఇంకొన్ని  చట్టాలకు చెందిన కేసులకు మినహా మిగతా అన్ని విషయా లను ‘ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం’ ద్వారా సలూ వుగా పరిష్కరించుకోవచ్చు. అటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూ ట్ రిసొల్యూషన్ (అఈఖ) ఆవశ్యకతను, అనుసరించాల్సిన పద్ధతుల గురించి కొంతవరకు తెలుసుకొందాం.
  
సాధరణ కోర్టులకు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకో వడానికి ఏళ్ళ తరబడి వేచివుండాలి. ఎందుకంటే అక్కడ అప్పటికే కుప్పలుతెప్పలుగా కేసులు పేరుకుపోయి వుంటా యి. సంప్రదాయమైన ప్రొసీజర్లతో ఎంతో కాలం వృధా అవుతుంది. పైగా డబ్బు ఖర్చు. కోర్టుకు వెళ్లేవారికి సమా జంలో ‘కోర్ట్ పక్షులు’ అనే వెటకారపు ముద్ర పడుతుంది. వీటన్నిటితో ఎంతో మానసిక ఒత్తిడికి లోనవుతారు. తద్వా రా వ్యాధుల బారిని కూడా పడతారు. చాల సందర్భాలలో కేసు ఓడినా, కేసు గెలిచినా లెక్కచూసుకొంటే చివరకు మిగిలేది- ‘అంతా దండగ’.

దీనికి విరుద్ధంగా అఈఖ సిస్టంలో అనుసరించే ప్రొసీజరంతా చాల సరళంగా ఉండి, కోర్టు వెలుపల వివా దాలు త్వరితగతిని సెటిల్ అవటంతో కాలం, డబ్బు వృధా కాదు. అఈఖను పూర్వకాలంలో జరిగే పెద్దమనుషుల పం చాయితి వంటిదని చెప్పవచ్చు.   
1. ఆర్బిట్రేషన్: ఇది  ఆర్బిట్రేషన్  కన్సీలియేషన్ చట్టం పరిధిలో వుంటుంది. ఈ పద్ధతిలో ప్రొసీజర్ సరళంగా వుం డి జాప్యం లేకుండా వివాదం త్వరితగతిన పరిష్కారం అవు తుంది. ఆర్బిట్రేటరుకు ఇవ్వాల్సిన ఫీజు వివరాలు  నిర్దేశిం చబడి వుంటాయి.

ప్రస్తావన: సేవలు, నిర్మాణ, వ్యాపార, వాణిజ్య పర మైన అగ్రిమెంట్లు రాసుకొనేటప్పుడే పార్టీలు ఆర్బిట్రేషన్ అంశాన్ని కూడా రాస్తారు. భవిష్యత్తులో మన లావాదేవీలలో ఏమైనా పొరపొచ్చాలు వస్తే ఆర్బిట్రేషన్ ద్వారా మనం పరి ష్కరించుకొందామనే క్లాజు పెట్టుకోవాలి. పార్టీలు ప్రస్తుతం ఎదుర్కొనే వివాదమే కాకుండా భవిష్యత్తులో తగాదాలకు ఆస్కారమున్న అంశాలను కూడా ఇప్పుడే ఒక కొలిక్కి తెచ్చుకోవచ్చు.

రంగప్రవేశం: ఇరుపార్టీల వివాదాన్ని పరిష్కరించే మూ డవ వ్యక్తిని ఆర్బిట్రేటర్ అంటారు. పార్టీలు కలిసి అవగా హనతో తమ వివాదాన్ని తీర్చటానికి ఒక పెద్దమనిషిని నియమించుకొంటారు. ఇతనిని ‘సోల్ ఆర్బిట్రేటర్’ అంటా రు. అలాకాకుండా వివాదంలో ఉన్న ప్రతిపార్టీ తమ తర పున వేరుగా ఆర్బిట్రేటరును నియమించుకోవచ్చు. ఈ సం దర్భంలో ‘పానల్ ఆర్బిట్రేటర్లు’ తెరమీదకు వస్తారు. తీర్పు ఇచ్చేటప్పుడు ఎక్కువ ఆర్బిట్రేటర్లు వెలిబుచ్చిన అభిప్రా యమే పార్టీలకు శిరోధార్యం అవుతుంది. ఆర్బిట్రేషన్ ద్వా రా అంతర్జాతీయ వివాదాలను కూడా పరిష్కరించు కోవచ్చు.

ఆర్బిట్రేటర్ అంటే ఎవరు? వీరు ఉద్యోగస్తులా? ఎక్కడ వుంటారు? వీరి అర్హతలు ఏమిటి?
వీరు ప్రత్యేకమైన ఉద్యోగస్తులు కారు. వీరు వయసులో మేజర్లు అయివుండి, సమస్యను పరిష్కరించగలిగే సమర్ధత ఉంటే చాలు. పార్టీలు సమర్ధత కలిగిన వారిని ఎవరినైనా ఆర్బిట్రేటర్ నియమించుకోవచ్చు. కానీ, వివాదపరిష్కారం తో ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ ఆర్బిట్రేటరుకు ఎటువంటి లబ్ధి (ఇంటరెస్ట్) వుండకూడదు. 

అర్హత విషయానికొస్తే ఆర్బిట్రేటరుకు నిర్దిష్టమైన చదువుసంధ్యలు ఉండాలనే నియమం లేదు. దక్షత, సామర్థ్యం ముఖ్యం. వీరికి ఆర్బిట్రేషను చట్టం మీద పట్టువుండాలి. లా యర్లతో పాటుగా ఈమధ్య కాలంలో చార్టెడ్ అకౌంటెన్టులు, కంపెనీ సెక్రెటరీలు, ఇంజనీర్లు, డాక్టర్లు మొదలైన వారు ఆర్బిట్రేటర్లుగా కొనసాగుతున్నారు. వీరికి ‘కోడ్ అఫ్ సివిల్ ప్రొసీజర్’ మీద అవగాహన వుండటం తప్పనిసరి. వివా దానికి సంబంధించిన సబ్జెక్టుతో పరిచయం వుంటే మరీ మంచిది.

నియామకం: వ్యాపారానికి సంబంధించిన అగ్రిమెంటు లోని క్లాజు ప్రకారం పార్టీలు ఆర్బిట్రేటర్లను నియమించు కోవచ్చు. కొన్ని సందర్భాలలో చట్టంలోనే (భూసేకరణ చట్టం వంటివి) ఈ ఆర్బిట్రేషన్ ప్రస్తావన వుంటుంది. కోర్టులో నడుస్తున్న కేసులను కూడా ఆర్బిట్రేషన్ ద్వారా పార్టీలు పరిష్కరించుకోవచ్చు. కోర్టు తనంతట తానుగా కూడా తమ వద్ద నడుస్తున్న కేసులను ఆర్బిట్రేషనుకు రిఫర్ చేయవచ్చు. ఈ కేసుకు నేను డీల్‌చేస్తానని ఆర్బిట్రేటర్ స మ్మతించాలి. కేసుకు సంబంధించి ఆర్బిట్రేషన్ ప్రోసెస్ ఎక్క డ జరుగుతుందో ఆ ప్రదేశాన్నే న్యాయస్థానంగా పరిగణి స్తారు. 
ప్రోసెస్: ఆర్బిట్రేటర్ ఇరుపార్టీలను (కొన్ని కేసులలో పార్టీల సంఖ్య ఎక్కువ ఉండవచ్చు) విచారణకు పిలిపించి ఫాక్టులను తెలుసుకొంటాడు. అసలు వివాదం ఎందుకు/ ఎ క్కడ వచ్చిందో గమనిస్తాడు. ఎవిడెన్సులను పరిశీలించి, స్టేట్మెంట్లను నమోదు చేస్తాడు. తమ వాదనలను వినిపించు కోవటానికి ఇరుపార్టీలకు సమాన అవకాశాలను కలిగిస్తాడు. ప్రోసెసును గోప్యంగా వుంచుతాడు. ఆ పిమ్మట అన్ని విష యాలను లాజికల్‌గా విశ్లేషించి, రీజన్సుతో సహా ‘ఆర్బిట్రల్ అవార్డు’ను ప్రకటిస్తాడు. అవార్డు స్టాంప్ పేపరు మీద రాత పూర్వకంగా వుంటుంది. కాలపరిమితి ప్రకారం ఒక సంవ త్సరం లోపుగా అవార్డు ప్రకటించాలి. అయినప్పటికీ సాధా రణంగా కొన్ని వారాలు/నెలలలోపే అవార్డు ఇస్తాడు. అవ సరాన్నిబట్టి అవార్డుకు ముందుగా కూడా మధ్యంతర ఉపశ మనంతో ఆర్బిట్రేటర్ ఉత్తర్వులు ఇవ్వవచ్చు. 

చట్టబద్ధత: అర్బిట్రేటరు ప్రకటించిన అవార్డుకు పార్టీ లు బద్ధులు కావాలి. దీనిని కోర్టులు ఇచ్చే తీర్పుగానే పరి గణించాలి. క్రీడల పోటీలలో అంపైర్‌లా అర్బిట్రేటరు నిష్పక్ష పాతంగా వ్యవహరించాలి. ఒకవేళ ఆర్బిట్రేటర్ ఒక పార్టీకి అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరించి అవార్డు ప్రకటించినా లేదా ప్రొసీజర్ సరిగ్గా అనుసరించక పోయినా, అటువంటి అవర్డును నష్టం వాటిల్లిన పార్టీ కోర్టులో ఛాలెం జ్ చేయవచ్చు. ఈ మధ్యనే రెండు కంపెనీల మధ్య జరిగిన కేసులో, అర్బిట్రేటరు భార్యకు వివాదంలో ఉన్న ‘ప్రతివాది’ కంపెనీలో షేర్లు ఉండటంతో ఆయన పక్షపాతానికి పాల్పడి అవార్డు ఇచ్చాడని, దీనితో తమకు అన్యాయం జరిగిందని, ఆ అవార్డును ‘వాది’ కంపెనీ కోర్టులో  ఛాలెంజ్ చేసింది. 

2. కన్సీలియేషన్: ఈ పద్ధతిలో పార్టీలు తమ వివా దాలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించు కొం టారు. వివాదాన్ని కన్సీలియేటరు (పెద్దమనిషి) ముందుం చుతారు. కన్సీలియేటరు వివాదాన్ని పూర్తిగా తెలుసుకొని, సముచిత పరిష్కారానికి పార్టీలను ఒప్పిస్తాడు. పార్టీలు అం గీకరించిన అంశాలతో తగిన స్టాంప్ పేపరు మీద ‘సెటి ల్మెంట్ పత్రం’ రాసి దానిమీద పార్టీలతో సంతకం చేయించి తాను కూడా ధ్రువీకరిస్తాడు. అదే నికరం. ఇది కోర్టు తీర్పు తో సమానం. దీనికి అప్పీలు వుండదు. పార్టీలు సెటిల్మెంట్ పత్రం లోని నిబంధనలకు బద్ధులై వుండాలి. నిబంధనలు తప్పిన పార్టీ కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఎదుర్కోవాల్సి వుంటుంది.  

3. మీడియేషన్: ఇది కొంతవరకు కన్సీలియేషన్ వం టిదే. తగాదాతో సంబంధం లేని తటస్థ వ్యక్తే మీడియేట రు. పార్టీలు తమ మధ్యనున్న అభిప్రాయభేదాలను ఆయ నకు వివరిస్తారు. ఈయనది న్యాయనిర్ణేత స్థానం కాదు. అయినప్పటికీ, విభేదాలను పార్టీలతో చర్చించి పంతాలకు, పట్టింపులకు స్వస్తిపలికేట్టు ప్రయత్నం చేస్తాడు. పార్టీల మ ధ్య చిరునవ్వు వాతావరణాన్ని కల్పిస్తాడు. దీర్ఘకాలిక ప్రయో జనాలను తగురీతిలో వివరిస్తూ మూడునెలలలోపే పరిష్కా రాన్ని సూచిస్తాడు. ఈ మీడియేటరు సెటిల్మెంటుకు పార్టీలు ‘కట్టుబడి’ ఉండాల్సిన పనిలేదు. వారు అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. అది పార్టీల ఇష్టం. దీనికి చట్టబద్ధత లేదు. కానీ మీడియేటరు సూచించిన సెటిల్మెంటును స్టాంప్ పేపరు మీద అగ్రిమెంటుగా రాసుకొని పార్టీలు సంతకాలు చేస్తే, అప్పుడే దానికి చట్టబద్ధత వస్తుంది. 
గతం గతః/తొల్లి గతించె: జరిగిందేదో జరిగిపోయింది. గతంలో జరిగిన తప్పొప్పులను బేరీజు వేయాల్సిన పని లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇరుపార్టీలకు తగిన న్యా యా న్ని సూచించటమే మీడియేటరు కర్తవ్యం. తేలిక మా టల్లో చెప్పుకొందాము. ఒకచోట అన్నాతమ్ముళ్లు ఒక బత్తా యి కోసం ‘నాది అంటే నాది’ అని గొడవ పడుతున్నారు. ఈ బత్తాయిని అమ్మ తనకు ఇచ్చిందని తమ్ముడు అంటు న్నాడు. తననే తీసుకొమ్మని నాన్న చెప్పాడంటాడు అన్న. వాదులాడుకుంటూ మీడియేటరు వద్దకు వెళ్లారు. ఈ ఇద ్దరిలో ఎవరిది తప్పో, ఎవరిది రైటో మీడియేటరు తేల్చి చెప్ప క్కరలేదు. చెరి కొంచెం తీసుకొమ్మని చెపుతాడు. పనికిరాని తొక్క(నాసిభాగం)ఎవరికి, రసభరితమైన తొనలు (మేలైన భాగం) ఎవరు తీసుకోవాలి? ఇక్కడే తొనలు ఇరువురకు ద క్కేటట్లు ధర్మబద్ధంగా సముచిత పరిష్కారం మీడియేటరు సూచించాలి.  
నా ఇరవై సంవత్సరాల న్యాయవాద వృత్తిలో ఎక్కువ సమయం వందలాది కేసులను రాజీ కుదర్చడానికే సరి పోయింది. అందుకు నేనేమీ నష్టపోలేదు. పైగా ఆత్మసంతృ ప్తినీ పొందాను అన్నారు గాంధీ.

4. నెగోషియేషన్: మధ్యవర్తులు లేకుండా, వివాదంలో వున్నా పార్టీలు తమంతట తామే సమస్యను చర్చించుకొని పరస్పర అంగీకారానికి రావటాన్నే నెగోషియేషన్ అంటా ము. ఇది ఉత్తమమైన పద్ధతి. రాజీ ధోరణిలో ఒక పార్టీ, అవతల పార్టీని కలిసి మాట్లాడి, సమస్యను అధిగమించే టట్లు ఎఫెక్టివ్ కమ్యూనికేషనుతో ఒప్పిస్తే, ఇరువురు అను కూలమైన పరిష్కారానికి వస్తారు. ఇరుపార్టీలలో ఎవరో ఒక రు చేసే చిన్న రాజీయత్నం కూడా పెద్ద ‘నెగోషియేషన్ సెటి ల్మెంటు’కు దారి చూపుతుంది. ఆ పిమ్మట ఇరుపార్టీలు ఏకా భిప్రాయానికి వచ్చి ‘అగ్రిమెంటు’లోకి వెళ్ళవచ్చు. ఈ పద్ధ తిలో పార్టీలు అవసరాన్ని బట్టి నిపుణులను కూడా సంప్రదించవచ్చు. 

5. లోక్ అదాలత్:  న్యాయస్థాన అధికారులు, న్యాయ సేవ కమిటీల మద్దతుతో లోక్ అదాలత్‌లు పనిచేస్తాయి. న్యాయస్థానాలకు రాలేని పేద, బలహీనవర్గాల వారికి కూడా న్యాయం అందుబాటులో వుండాలని, ప్రతికోర్టులోనూ ని యమిత రోజులలో లోక్ అదాలత్ జరుగుతుంది. ఇరుపా ర్టీలు కూడబలుక్కుని, సాధారణ కోర్టులో పెండింగులో ఉన్న వారి కేసును లోక్ అదాలత్‌కు బదిలీ చేసుకోవచ్చు. ఇక్కడ చైర్మనుగా సిట్టింగ్/రిటైర్డు జడ్జి వుం టారు. అనుభవం ఉన్న న్యాయవాది ఒకరు, సామాజిక కార్యకర్త ఒకరు మెంబర్లుగా వుంటారు. ప్రొసీజరు, అవిడెన్సు ఆక్టులను అంతగా పట్టిం చుకోరు. వీరు పార్టీలను రాజీకి ప్రోత్సహిస్తారు. ఇచ్చిపుచ్చు కొనే ధోరణిలో ఇరుపార్టీలు రాజీకి అంగీకరిస్తే, వివాదం అ క్కడే ‘సెటిల్’ అయిపోతుంది. ఆ మీదట అప్పీలుకు వెళ్ళే అవకాశం వుండదు. ఇరువురిలో ఎవరు రాజీకి రాకపోయినా కేసు మళ్ళీ తిరిగి రెగ్యులర్ కోర్టుకి వెళ్ళిపోతుంది. లోక్ అ దాలత్‌లో కోర్టు ఫీజు వుండదు. పైగా లోక్ అదాలత్‌లో కే సు సెటిల్ అయినట్లయితే, కేసు ఫైల్ చేసినప్పుడు రెగ్యులర్ కోర్టులో కట్టిన ఫీజు కూడా (పార్టీ ఆర్థికస్థితిని బట్టి) కోర్టు నుండి తిరిగి వస్తుంది. రెవెన్యూ మేటర్స్, కార్మికుల నష్ట పరిహారం వంటి సివిల్ కేసులతో పాటు, మోటారు యాక్సి డెంట్ కేసులు, ఫ్యామిలీ తగాదాలు, వైద్యుల నిర్లక్ష్యం, స్వ ల్ప కాలిక శిక్షలు పడే  సెక్షన్ల కింద ఫైల్ అయిన క్రిమినల్ కేసులను సైతం (కాంపౌన్డబుల్ అఫెన్సెస్) ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. 
జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ: వివాదాలను కేసులను  కోర్టులో ఫైల్ చేయకుండానే, నేరుగా వీరివద్ద ప్రీ-లిటిగేష న్ కంప్లైంటును ఇవ్వవచ్చు. ఎటువంటి ఫీజులు వుండవు. ఇక్కడ అధికారులు ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు. కంప్లైం టుపై విచారణ జరిపి సముచితమైన నిర్ణయం తీసుకొంటా రు. ఇక్కడే సమస్య సెటిల్ అయిపోతే ఆ మీదట కోర్టుకు వెళ్ళే అవసరమే రాదు. ప్రతిజిల్లా కోర్టు ఆవరణలో ఈ అథారిటీ కార్యాలయం వుంటుంది.

6. ఫ్యామిలి కౌన్సెలింగ్ సెంటర్లు: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు పోలీసు స్టేషనుకు వెళ్ళినప్పుడు నిపుణులను పిలిపించి కౌన్సెలింగు ఇప్పిస్తారు. ఒకపార్టీ కోర్టులో విడా కుల కేసు వేసినప్పుడు, కోర్టువారు భార్యాభర్తలిద్దరినీ కౌన్సె లింగుకు పంపిస్తారు. కౌన్సెలింగ్ సెంటర్లకు విడాకులు ఇచ్చే కెపాసిటీ వుండదు. కానీ శాస్త్రీయ విధానంలో వారి సమస్య ను విశ్లేషించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తారు. వారితో చర్చించి వారిని కలిసి జీవించే విధంగా ప్రోత్సహిస్తారు. కౌన్సెలింగు తరువాత కూడా కలిసి వుండటం ఎంతమాత్రమూ వీలుకాదని పార్టీలు భావించిన ప్పుడు కనీసం విడిపోవటాని కైనా పరస్పర అంగీకారానికి వచ్చే అవకాశం వుంది.
ఎటువంటి కేసులు: పెద్ద క్రిమినల్ కేసులు, విడాకులు, గార్డియను, మనోవర్తి, వీలునామా, పబ్లిక్ ఛారిటబుల్ ఆర్గై నెజేషన్లు, ట్రస్టులు, ఇన్కమ్ టాక్స్, దివాలా పిటీషను వం టి కేసులు  ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం ద్వారా పరి ష్కరించలేము. పార్టిషను సూటులు, స్థలాల గొడవలు, ప్రా మిసరీ నోటు, కాంట్రాక్టు, బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్, ఇ న్సూరెన్స్, వినియోగదారుల హక్కులు, నిర్మాణ ప్రోజెక్టులు వంటి సివిల్ వివాదాలు, చెక్కు కేసులు, చైల్ కస్టడి మొద లైన అనేక రకాలైన వివాదాలను అఈఖ పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవచ్చు.     

ముగింపు: పై విధానాలే కాకుండా వివాదం త్వరితగతి న పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్, భూపరిపాలన కమిటీలు, కమర్షియల్ కోర్టులు, ప్రత్యేక కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు, వినియోగదారులకు ఫోరమ్స్, లోకాయుక్త, కేంద్ర, రాష్ట్ర మా నవ హక్కుల కమిషను్లున్నాయి. ఇవే కాకుండా సివిల్ సర్వీ సు అధికారులకు(కలక్టరు), రెవెన్యూ డివిజినల్ అధికారు లకు, తహసీల్దారులకు కూడా వివాదాలను పరిష్కరించటా నికి పరిమితమైన అధికారాలు వున్నాయి. 

- ఎల్.టి. చంద్రశేఖర రావు
న్యాయవాది, హైదరాబాద్
9440328586

English Title
Dispute Resolution Act
Related News