దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ

Updated By ManamThu, 07/19/2018 - 10:58
dil raju

dil raju హీరో కావాల‌ని ఎవ‌రికీ ఉండ‌దు చెప్పండి.. ఎవ‌రికైనా హీరో కావాల‌నే ఆశ ఉంటుంది. ముఖ్యంగా నేడు రాజ‌కీయాల్లోనే కాదు.. సినిమా రంగంలో కూడా వారస‌త్వం మొద‌లైంది. స్టార్ హీరోలే కాదు చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌ల త‌న‌యులు కూడా హీరోలుగా త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకోవ‌డానికి ఇక్క‌డ క‌ష్ట‌ప‌డుతున్న‌వారే. ఇలాంటి త‌రుణంలో అగ్ర నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు కుంటుంబం నుండి ఓ హీరో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. దిల్‌రాజు సోద‌రుడు శిరీశ్ నిర్మాత‌గా రాణిస్తున్న సంగ‌తి విదితమే. ఈయ‌న త‌న‌యుడు ఆశిశ్ రెడ్డి హీరోగా ఎంట్రీకి రంగం సిద్ద‌మ‌వుతోంది. పలుకు బంగారు మాయేనా అనే టైటిల్‌తో సినిమా రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రానుంది. 
 

English Title
Dil Raju's nephew make his debut
Related News