ఇంద్రగంటితో దిల్‌ రాజు మల్టీస్టారర్

Updated By ManamThu, 07/12/2018 - 16:59
dil raju

dil Raju తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంద‌ర్భంలో వెంకటేశ్, మహేశ్‌లతో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు` అనే చిత్రాన్ని తెరకెక్కించి మల్టీస్టార‌ర్ చిత్రాల‌కు నాంది ప‌లికిన నిర్మాత దిల్‌రాజు. అప్పటి నుంచి తెలుగులో మల్టీస్టారర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వ‌స్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి దిల్ రాజు తాజాగా మరో మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధమయ్యాడు. ‘అష్టాచ‌మ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’‌, ‘అమీ తుమీ’, ‘జెంటిల్‌మన్’‌, ‘స‌మ్మోహ‌నం` వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

English Title
Dil Raju Multi Starrer with Mohan Krishna Indraganti
Related News