దేవీనే కావాలంటున్న దిల్ రాజు..?

Updated By ManamFri, 05/25/2018 - 13:27
devi, dil raju

hgpk టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌కు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా మూవీ పోస్టర్‌లో దేవీ పేరు ఉందంటే ఆ సినిమా సగం హిట్ అని పలువురు అభిప్రాయపడుతుంటారు. అందుకే కొంచెం డిమాండ్ ఎక్కువైనా అతడినే తమ సినిమాలకు తీసుకోవాలని చూస్తుంటారు దర్శకనిర్మాతలు. 

అయితే ఇటీవల విదేశీ టూర్లపై మక్కువ చూపిస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ తనకు వచ్చిన కొన్ని సినిమాలను వదులుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చిత్రం హలో గురు ప్రేమ కోసమే నుంచి దేవీ తప్పుకున్నాడని, ఆ స్థానంలో థమన్ వచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మళ్లీ దేవీనే ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయినట్లు తెలుస్తోంది. మామూలుగా ఈ చిత్రాన్ని ఆగష్టులో కానీ సెప్టెంబర్‌లో కానీ విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించాడట. ఆ సమయంలో దేవీకి యూఎస్ టూర్ ఉండటంతో చేయలేనని చెప్పేశాడట. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దసరా తరువాత విడుదల చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడట. ఆ సమయంలోగా దేవీ టూర్ కూడా ముగియనుండటంతో ఎలాగైనా అతడినే ఒప్పించాలని దిల్ రాజు భావిస్తున్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ నటిస్తుండగా.. త్రినాథరావు దర్శకత్వం వహించనున్నాడు. 

English Title
Dil raju don't want to lose Devi Sri Prasad for Ram Movie..?
Related News