ఆ రికార్డుకు 33 పరుగుల దూరంలో ధోని

Updated By ManamThu, 07/12/2018 - 15:03
dhoni

dhoni టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డుకు దగ్గర్లో ఉన్నారు. వన్డే సిరీస్‌లలో పదివేల పరుగుల రికార్డుకు కేవలం 33 పరుగుల దూరంలో ధోని ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లలో ధోని ఈ రికార్డును చేరుకుంటాడని పలువురు భావిస్తున్నారు. కాగా ఒకవేళ ధోని ఆ 33 పరుగులు చేసినట్లైతే వన్డేలలో 10వేల పరుగులు చేసిన భారత ఆటగాళ్లు సచిన్, ద్రవిడ్, గంగూలీ సరసన చేరనున్నారు. అయితే ఇప్పటి వరకు 318 వన్డేలు ఆడిన ధోని 9,967పరుగులు చేశాడు. మరోవైపు ఈ రికార్డుకు టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా దగ్గరలో ఉన్నారు. 208 వన్డేలను ఆడిన కోహ్లీ ఇప్పటి వరకు 9,588 పరుగులు చేశారు. దీనితో పాటు వన్డేలలో 300 క్యాచ్‌లు పట్టిన క్రికెటర్ల రికార్డుకు మూడు క్యాచ్‌ల దూరంలో ఉన్నాడు ధోని.

కాగా 200 వన్డేలు ఆడిన సచిన్ 18,426 పరుగులు చేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే భారత్ తరఫున 10వేల రికార్డును కొల్లగొట్టిన లిస్ట్‌లో గంగూలీ (183వన్డేలు- 11363 పరుగులు) రెండో స్థానంలో, రాహుల్ ద్రావిడ్ (153 వన్డేలు-10889 పరుగులు) మూడో స్థానంలో ఉన్నారు.

English Title
Dhoni set to join Sachin, Dravid, Ganguly list
Related News