సీటిస్తే ‘కన్నా’ టీడీపీలోకి వస్తానన్నాడు

Updated By ManamThu, 06/14/2018 - 12:02
Devineni Uma, Kanna lakshminarayana, BJP, TDP

devineni అమరావతి: సీటిస్తే టీడీపీలోకి వస్తానన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ.. ఢిల్లీకి వెళ్లి మాపై విమర్శలు చేయడమేంటో అర్థం కాలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పోలవరంలో 9వేల కోట్ల పనులు జరిగితే.. కార్మికుల, ఇంజనీర్ల కష్టాన్ని అవమానించేలా వైసీపీ వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు.

పోలవరంపై జగన్‌కు అవగాహన లేదని, అందుకే సినిమాతో పోలుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గోదావరి డెల్టాకు ఇప్పటికే 5టీఎంసీల నీటిని విడుదల చేశామని, గోదావరి ప్రవాహం పెరిగిన తరువాతే పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరు ఇస్తామని అన్నారు.

 

English Title
Devineni Uma Maheswara Rao comments on Kanna Lakshmi Narayana
Related News