‘ప్రతినిధుల’పై  డెమోక్రాట్లు

Updated By ManamFri, 11/09/2018 - 01:40
america
  • సెనేట్‌లో ‘ట్రంప్’ రిపబ్లికన్లు

  • అమెరికా కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

  • అధికార రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ

  • డొమోక్రాట్లతో కలిసి పని చేస్తాం

  • స్నేహ హస్తం చాచిన అధ్యక్షుడు

americaవాషింగ్టన్: అమెరికాలో కాంగ్రెస్‌కు అంత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగన మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలువ వెలువడ్డాయి. ప్రతినిధుల సభ (దిగువ సభ-మన దేశంలో లోక్‌సభతో సమానం)లో విపక్ష డెమోక్రాట్లు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. కాగా, సెనేట్ (ఎగువసభ)లో అధ్యక్షుగడు ట్రంప్ రిపబ్లిక్ పార్టీ సెనేట్ ఆధిక్యం సాధించింది. ప్రతినిధుల సభలోని 435 స్థానాల్లో ఎన్నికలు జరగగా 419 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 223 స్థానాల్లో డెమోక్రాట్లు గెలుపొందగా, 196 స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. గతంలో రిపబ్లికన్లు గెలిచిన 28 స్థానాలను కూడా డెమోక్రాట్లు కైవసం చేసుకోవడంతో హౌస్‌లో డెమోక్రాట్లు మోజార్టీని పొందారు. ఇక సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్ పార్టీ ఎట్టకేలకు తమ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్ జరగగా.. 32 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలనంతరం సెనేట్‌లో రిపబ్లికన్లు 51 మంది, డెమోక్రాట్లు 49 మంది అయ్యారు. ఇందులో డెమోక్రాట్లు రెండు సీట్లను కోల్పోయారు. ఇంకా మూడు స్థానాల్లో ఫలితా లు వెలువడాల్సి ఉంది. ఇక 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు జరగగా ఇప్పటికి 33 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తాజా ఫలితాలతో డెమోక్ర టిక్ గవర్నర్లు గతం కంటే ఏడుగురు పెరిగారు. తాజా ఫలితాలతో ట్రంప్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసు కునే అవకాశం ఉండదని, డెమోక్రాట్ల మద్దత ఉంటేనే ముందుకు వెళ్లగలరని నిపుణులు అంటున్నారు.

సీఎన్‌ఎన్ రిపోర్టర్ పాస్ రద్దు!
మీడియాపట్ల దురుసుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర ఎన్నికల ఫలితాల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో తనతో వాగ్యుద్ధానికి దిగిన సీఎన్‌ఎస్ రిపోర్టర్ జిమ్ అకోస్టా ఇకపై వైట్‌హౌజ్‌లోకి రాకుండా ఆదేశాలు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.  జిమ్ అకోస్టా ప్రెస్ పాస్‌ను రద్దు చేశారు.  మీడియా సమావేశంలో వలసదారులపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను ప్రస్తావిస్తూ.. ఇది ఒకరమైన దాడే కదా అంటూ ఆ జర్నలిస్టు ప్రశ్నించారు. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. మరో ప్రశ్న అడిగేందుకు అకోస్టా సిద్ధమవుతుండగా.. ‘కూర్చో.. అతడి నుంచి మైక్రోఫోన్ లాక్కోండి’ అంటూ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యలో వైట్‌హౌజ్‌లోకి రాకుండా ఆయన పాస్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags
English Title
Democrats on 'Representatives'
Related News