అత్యధిక జనాభా కలిగిన నగరంగా ఢిల్లీ!

Updated By ManamThu, 05/17/2018 - 22:31
delhi
  • 2028కి 37.2 మిలియన్ల మంది: ఐరాస

delhiఐక్యరాజ్యసమితి, మే 17: 2028 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా భారత రాజధాని ఢిల్లీ అవతరించనుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం 37 మిలియన్ల మంది జనాభా ఉన్న టోక్యో నగరాన్ని ఢిల్లీ అధిగిమించనుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది జనాభా నగరాల్లోనే నివాసముంటారని ఈ నివేదిక పేర్కొంది. 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలోని 43 మెట్రో నగరాల్లో జనాభా అనూహ్యంగా పెరగనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. పదిమిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరాల సంఖ్య పెరగవచ్చని పేర్కొంది. 2028 నాటికి ఢిల్లీ నగరం 37. 2 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరంగా మారనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. భారతదేశంతో పాటు చైనా, నైజేరియా దేశాల్లో జనాభా అనూహ్యంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో జనాభా అనూహ్యంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం డైరెక్టరు జాన్ విల్ మోత్ చెప్పారు. ప్రస్తుతం 55 శాతం ఉన్న నగరాల జనాభా 2050 నాటికి 68 శాతానికి పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. పెరుగుతున్న నగరాల జనాభాకు అనుగుణంగా విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి సూచించింది.

Tags
English Title
Delhi is the most populous city
Related News