మహిళల బాక్సింగ్ టోర్నీకి ఢిల్లీ ఆతిథ్యం

Updated By ManamFri, 09/21/2018 - 23:46
Boxing

Boxingన్యూఢిల్లీ: దాదాపుగా దశాబ్దం తర్వాత ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు దేశ రాజధాని న్యూఢిల్లీ ఆతిథ్య మివ్వనుంది. ఈ టోర్నీ నవంబర్ 15న ప్రారంభమవుతుందని అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నవంబర్ 13 నాటికి జట్లన్నీ ఇక్కడికి చేరుకుంటాయి. రెండ్రోజుల తర్వాత పోటీలు ప్రారంభమవుతాయి. ‘ఏఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నవంబర్ 13 నుంచి 25వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతాయి’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ మెగా టోర్నీకి గతంలో అంటే 2006లో భారత్ ఆతిథ్యమిచ్చింది. ప్రతిభ పరంగా భారత్ టాప్‌లో నిలిచింది. 4 స్వర్ణ, 3 రజత, 1 కాంస్య పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత ప్రముఖ మహిళా బాక్సర్ మేరీకోమ్ ఆరోసారి వరల్డ్ టైటిల్‌పై కన్నేసింది. మేరీకోమ్‌ను ఏఐబీఏ ముద్దుగా ‘మ్యాగ్నిఫిసెంట్ మేరీ’ అని పిలుస్తుంది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు నవంబర్ 13వ తేదీ వరకు ఢిల్లీ చేరుకోవాలి. ప్రతి బాక్సర్ కూడా కనీసం ఏఐబీఏకు చెందిన ఒక సర్టిఫికెట్‌తో రావాల్సివుంటుంది. మేరీకోమ్ 2002, 2005, 2006, 2008, 2010 ఎడిషన్లలో స్వర్ణ పతకాలు గెలిచింది. పేర్లు నమోదు చేసుకుందుకు అక్టోబర్ 5 చివరి తేదీ అని ఏఐబీఏ అధికారి తెలిపారు. 2001లో జరిగిన చివరి ఎడిషన్‌లో భారత్ ఒకే ఒక్క రజతం గెలిచింది. సోనియా లేదర్ ఫీదర్‌వెయిట్ (75 కిలోలు) కేటగిరిలో ఈ పతకం గెలిచింది. తొలి ఎడిషన్ మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్ 2001లో యునైటెడ్ స్టేట్స్‌లోని స్క్రాంటన్‌లో జరిగింది.

Tags
English Title
Delhi host to women's boxing tournament
Related News