మాస్టర్‌కార్డ్‌లో భారతీయుల డాటా తొలగింపు

mastercard

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సర్వర్‌లో ఉన్న భారతీయ బ్యాంకు యూజర్ల డాటాను తొలగించనున్నట్లు గ్లోబల్ పేమెంట్ దిగ్గజమ మాస్టర్‌కార్డ్ ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాస్టర్‌కార్డ్ తెలిపింది. అయితే, తమ వినియోగదార్ల డాటాను గ్లోబల్ సర్వర్ నుంచి తొలగించిన్పటికీ కొంత కాలం వరకు భద్రతా విషయంలో బలహీనంగా ఉండనున్నట్లు మాస్టర్ కార్డు హెచ్చరించింది. మాస్టర్‌కార్డ్ సంస్థ ప్రస్తుతం 200 దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహింస్తోంది. అయితే ఇలా డాటాను తొలగించమని ఆర్డర్ వచ్చినట్లు మాస్టర్ కార్డ్ ఇండియా, సౌత్ ఏషియా డివిజన్ అధిపతి పౌరుష్ సింగ్ తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ ఏ దేశము ఇలా డాటా తొలగింపునకు ఆసక్తి చూపలేదని, దాని వల్ల పెద్దగా లాభం కూడా లేదని ఆయన ఆభిప్రాయ పడ్డారు. బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన వివరాలతో పాటు, భారతీయుల వివరాలను పేమెంట్ కంపెనీలు అంతర్జాతీయ సర్వర్ల నుంచి తొలగించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 16 నుంచి దీన్ని అమల్లోకి తేవాలని తెలిపింది. అయితే డాటా తొలగింపునకు  ఇంకా తమకు పూర్తి ఆదేశాలు చేరలేదని అవి వచ్చిన వెంటనే తొలగింపు ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, డాటా తొలగింపు ప్రక్రియ ఒక బటన్ నొక్కడం వల్ల అయ్యేంత సులభమైన ప్రక్రియ కాదని, దానిలో చాలా సమస్యలుంటాయని ఆయన పేర్కొన్నారు. స్పష్టమైన ఆదేశాలు అందిన వెంటనే రోజూవారీగా డాటా తొలగింపు ప్రక్రియ ప్రారంభమౌతుందని ఆయన సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అంతర్జాతీయ సర్వర్లలో ఉన్న భారతీయుల వివరాలను తొలగించనున్నట్లు మాస్టర్‌కార్డ్ వెల్లడించనుంది. అంతేకాదు, భారతీయులు జరిపిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను పుణెలోని తమ టెక్నాలజీ సెంటర్‌లో అక్టోబరు 6న భద్రపరిచినట్లు పేర్కొంది. ‘ఆర్‌బీఐ ప్రతిపాదనల మేరకు భారతీయులకు సంబంధించిన డేటా ఎక్కడ ఉన్నా దాన్ని తొలగిస్తాం. . కాగా, మాస్టార్ కార్డ్‌కు అవసరమైన సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ దేశ ఖాతాదార్ల సమాచారాన్ని ఆ దేశంలోనే భద్రపరుస్తామని అవసరమైనంత వరకు మాత్రమే ఇతర ప్రాంతాలకు డాటాను పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. అది కూడా ఆ ప్రాంత గోప్యతా, రక్షణ నియమాలకు అనుగుణంగానే సాగుతుందని ఆయన వెల్లడించారు. 

Tags

సంబంధిత వార్తలు