వాట్సాప్ వీడియో.. భారత్‌లో దాడులు

Updated By ManamMon, 07/09/2018 - 16:43
Death by whatsapp how a video shot in pakistan led to death of 30 people in india
  • పిల్లల కిడ్నాప్ వదంతుల్లో కొత్త కోణం

Death by whatsapp how a video shot in pakistan led to death of 30 people in indiaకరాచీ: పిల్లల అపహరణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తీసిన ఓ వీడియో అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజమని కరాచీకి చెందిన ఓ స్వచ్చంద సంస్థ చెబుతోంది. పాకిస్థాన్‌లోని కరాచీలో పసిపిల్లల అపహరణ చాలా ఎక్కువని రోషిణి స్వచ్చంద సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విషయంపై అవగాహన పెంచేందుకు 2016లో తామో వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ వీడియోలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ జంట చేతుల్లో ఉన్న పసికందును ఎత్తుకెళ్లి పోతారు. ఆపై కాసేపటికి తిరిగి ఆ బిడ్డను అప్పగించేందుకు వస్తూ.. ఆ యువకులలో ఒకరు ప్లకార్డు ప్రదర్శిస్తాడు. అందులో ‘కరాచీ వీధుల్లో చిన్నారులను అపహరించడానికి ఓ క్షణం చాలు’ అని రాసి ఉంటుంది.

మీ పిల్లల భద్రతపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాలన్న సందేశంతో ఈ వీడియోను రూపొందించి ఫేస్‌బుక్‌లో పెట్టామని రోషిణి ప్రతినిధి వివరించారు. అప్పట్లో దీనికి విపరీతమైన స్పందన వచ్చిందని వివరించారు. అయితే, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు దుండగులు తాజాగా ఈ వీడియోను మార్పింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీడియోను ఎడిట్ చేసి వాట్సప్, ఫేస్‌బుక్‌లలో ప్రచారం చేయడంతో భారత్‌లో అమాయకులపై దాడులకు కారణమైందని, దాదాపు 30 మందికి పైగా ఈ దాడుల్లో మరణించడంపై రోషిణి ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు. వదంతులు నమ్మి అమాయకులపై దాడులకు పాల్పడవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

English Title
Death by whatsapp how a video shot in pakistan led to death of 30 people in india
Related News