నష్టం జరగదు.. నాది హామీ

Narendra Modi
  • మీ హక్కులకు భంగం వాటిల్లదు 

  • ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ప్రధాని హామీ

షోలాపూర్: పౌరసత్వ బిల్లును ఆమోదిం చడం వల్ల అసోంతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరగబోదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అక్కడి వారి హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లదని హామీ ఇచ్చారు. జాతీయ పౌరసత్వ బిల్లుపై కొన్ని పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మకూడ దని చెప్పారు. బుధవారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనం తరం జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. షోలాపూర్ -ఉస్మానాబాద్ 4 లేనింగ్ రోడ్డును మోదీ ప్రారంభించా రు. దీనికి 2014లో ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద 30 వేల గృహాల నిర్మాణా నికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ఇళ్ళు చెత్త ఏరుకునే వారు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు వంటి సొంత ఇళ్ళు లేనివారి కోసం నిర్మిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. జాతీయ పౌరసత్వ బిల్లుపై ఎలాంటి ఆందోళన చెందొద్దని అసోం, ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సూచించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించన నేపథ్యంలో అసోంతోపాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో హంస చెలరేగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టి న బంద్‌తో జనజీవనం స్తంభించింది. ఈ బంద్‌కు ఏజీపీ, కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, కేఎంఎసఎస్ మద్దతు తెలిపాయి. బంద్ ప్రభావం అసోంలో తీవ్రంగా కనిపిం చింది. ఏఏఎసయూ కార్యకర్తలు, ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగా రు. జాతీయ హైవేలను దిగ్బంధించారు. చాలా ప్రాం తాల్లో వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. రైలు పట్టాలపై బైఠాయించారు. దిబ్రూ గఢ్‌లో సీఎం సర్బానంద సోనోవాల్ ఇంటి వద్ద ఆందో ళనకారులు నిరసన వ్యక్తం చేశారు. సీఎంను ఘెరావ్ చేశారు. దాదాపు 100 సంస్థ లు బంద్‌కు మద్దతివ్వడంతో ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మైఖేల్ మామ వల్లే ఒప్పందం ఆగిందా?
కాపలాదారు చీకట్లో అయినా సరే తప్పు చేసేవారిని పట్టుకోగలడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రఫేల్ యుద్ద విమానాల ఒప్పందంలో కుంభకోణం జరిగి నట్లు ఆరోపిస్తున్న కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అవినీతి ని తుద ముట్టించే కార్యక్రమం చేపట్టిన కాపలాదారును ఎవరూ కొనలేరని, బెదిరించలేరని హెచ్చరించారు. అటు వంటి ప్రయత్నాలు ఎన్ని జరిగినప్పటికీ కాపలాదారు తన పనిని అవిశ్రాంతంగా నిర్వహిస్తారని చెప్పారు. అగ స్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో ఇటీవల అరెస్టయిన క్రిస్టియన్ మైఖేల్ రఫేల్ కంపెనీ ప్రత్యర్థి కంపెనీ అఅయిన యూరోఫైటర్ కంపెనీ తరపున లాబీయింగ్ చేశారన్నారు. ‘‘ఆ మైఖేల్ మామ వల్లే రఫేల్ ఒప్పందం కుదరలేదా?’’ అని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ ప్రశ్నించారు.  పత్రికల్లో వార్తలను ప్రస్తావిస్తూ మైఖేల్ మరికొన్ని ఇతర పోటీ కంపెనీలకు లాబీయింగ్ చేశారన్నారు. కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైఖేల్‌తో ఏ నేతకు సంబంధాలు ఉన్నాయో కాంగ్రెస్ వెల్లడించాలన్నారు. క్రిస్టియన్ మిషెల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల ప్రశ్నించింది. ‘శ్రీమతి గాంధీ’, ‘ఇటలీ మహిళ తనయుడు’ అనిమైఖేల్ చెప్పారని కోర్టుకు ఈడీ తెలిపింది.

సంబంధిత వార్తలు